UP: ఏం మనుషులురా మీరు, మగబిడ్డ కోసం ఒక మహిళను మామ, బావ దగ్గర పడుకోవాలని బలవంతం చేశారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో జరిగింది. మగబిడ్డపై ఉన్న కోరికతో రెండు సార్లు అబార్షన్లు చేయించారు. దీని తర్వాత ఆమె మామ, బావతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకోవాల్సి వచ్చింది. 2021లో మెహక్ ఖాన్‌కు షా ఫహీమ్ అనే వ్యక్తితో వివాహమైంది. కొన్ని నెలల్లోనే ఆమె భర్త, అత్తంటి వారి నుంచి వరకట్న వేధింపులు ప్రారంభమయ్యాయి. లక్షల రూపాయలు, కారు కావాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఆమెపై మానసికంగా, శారీరకంగా దాడికి పాల్పడ్డారు.
Read Also: AP Weather Alert: 4 రోజులు అతి భారీ వర్షాలు.. ఇంట్లోనే ఉండండని హోంమంత్రి సూచన!
ఈ క్రమంలోనే బాధిత మహిళకు ఒక కుమార్తె జన్మించింది. దీని తర్వాత వేధింపులు మరింతగా పెరిగాయి. మెహక్ మళ్లీ గర్భవతి అయిన రెండుసార్లు ఆల్ట్రా సౌండ్ స్కాన్ చేయించి , ఆడ పిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించారు. మెహక్ అత్త, వదినలు ఆమెను మామ, బావ దగ్గర పడుకోవాలని, వారితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేశారు. తన మామ, బావలు అనేక సందర్భాల్లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. భర్తకు చెప్పినా కూడా పట్టించుకోలేదని చెప్పింది. కొన్ని రోజుల క్రితం మెహక్‌ను అత్తి్ంటి వారు ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆమె భర్త, అత్త, వదిన, బావ సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
