Uttar Pradesh Girl Bites Off Man Lip As He Tries To Kiss Her Forcefully: అత్యాచారం చేయబోయిన యువకుడి నుంచి తనని తాను కాపాడుకోవడం కోసం ఒక యువతి సాహసోపేతమైన పని చేసింది. ఎంత ప్రాధేయపడినా తనని విడిచిపెట్టకపోవడంతో.. ఆ కామాంధుడి పెదవి తెగిపోయేలా కొరికి, అతనికి తగిన బుద్ధి చెప్పింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. ఆ కీచకుడు బలవంతంగా ముద్దు పెట్టేందుకు ప్రయత్నించినప్పుడు.. బాధితురాలు అతడి పెదవి గట్టిగా కొరికింది. దీంతో.. అతని పెదవి భాగం తెగి, కిందకు పడింది. ఇంతలో మహిళ గట్టిగా కేకలు వేయడంతో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న జనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడ్ని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. శనివారం మధ్యాహ్నం దారువాలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పాట్‌కి చేరుకొని, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తెగిపడిన పెదవి భాగాన్ని పాకెట్‌లో సీల్ చేసి, దగ్గరలోని ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం తరలించారు. బాధితురాలు నిందితుడిపై పోలీస్ కేసు నమోదు చేసింది.
Revanth Reddy: పాదయాత్రకి బయలుదేరిన రేవంత్.. హారతి ఇచ్చిన కూతురు నైనిషా..
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ఆమె పని నిమిత్తం పొలానికి వెళ్లింది. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవ్వరూ లేరని, మొత్తం నిశ్శద్ద వాతావరణం ఉందని తెలిపింది. అప్పుడు నిందితుడు వెనుక నుంచి ఒక్కసారిగా తనపై ఎగబడి, గట్టిగా పట్టుకున్నాడని పేర్కొంది. దీంతో తాను కంగారుపడ్డానని, తనని ఎవరలా పట్టుకున్నారో అర్థం కాక భయబ్రాంతులకు గురయ్యానని చెప్పింది. తాను అరిచేందుకు ప్రయత్నించగా.. నిందితుడు తన గొంతు పట్టుకున్నాడని, ఆ తర్వాత పొలంలోకి లాక్కెళ్లి తన బట్టలు విప్పేందుకు ప్రయత్నించాడని తెలిపింది. అతని చెర నుంచి తప్పించుకోవడం చాలా ప్రయత్నించానని, ఇంతలో ఆ యువకుడు బలవంతంగా ముద్దాడేందుకు ప్రయత్నించాడని చెప్పింది. తనని తాను కాపాడుకునేందుకు అదే సరైన అవకాశమని భావించి.. అతని పెదవిని గట్టిగా కొరికేశానంది. దాంతో అతని పెదవి తెగి కింద పడిపోయిందని, అతడు బాధపడటం మొదలుపెట్టాడని చెప్పింది. ఈలోపు తాను గట్టిగా కేకలు వేయడంతో, చుట్టుపక్కలుండే ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారని వివరించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Vani Jayaram: ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేసింది.. ఆ గాయాలకు కారణమిదే!