Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. సభ్యసమాజం తలవంచుకునే విధంగా, తండ్రిలా ఉండాల్సిన మామ, తన కొడలిపై దారుణానికి తెగబడ్డాడు. కొడుకు భార్య అనే సోయి లేకుండా అత్యాచారం చేశాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ దారుణం జరిగింది. మామ తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ 26 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తను బెదిరించి, తీవ్రంగా కొట్టాడని చెప్పింది.
Read Also: Tata Nexon.ev facelift: నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ధర రూ.14.74 లక్షల నుంచి ప్రారంభం..
తనకు జరిగిన అన్యాయం గురించి భర్తకు తెలిపితే, ఇప్పుడు భర్త కూడా తనతో కలిసి జీవించడానికి నిరాకరిస్తున్నాడని, తనను ఇంటి నుంచి వెళ్లగొట్టాడని సదరు బాధిత మహిళ ఆరోపించింది. ప్రస్తుతం బాధితురాలు తన తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అయితే ప్రస్తుతం మహిళ ఏడు నెలల గర్భిణి అని, ఈ విషయాన్ని మహిళ పేర్కొనలేదని పోలీసులు తెలిపారు.
Read Also: Tata Nexon facelift: నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. వేరియంట్ వారీగా రేట్లను ప్రకటించిన టాటా మోటార్స్..
బాధితురాలి ఫిర్యాదు మేరకు మామ, భర్తపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి రవీందర్ యాదవ్ తెలిపారు. అయితే కోడలి ఆరోపణల్ని ఆమె మామ ఖండించారు. డబ్బు సంపాదించాలని మాపై ఆమె ఒత్తడి తెస్తున్నట్లు పేర్కొన్నాడు.