Sexual Harassment: ఆయనో ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్. ఆయనపై ఎంతో బాధ్యత ఉంటుంది. రేపటి పౌరులను తీర్చిదిద్దాల్సిన ఆయన తన ఉపాధ్యాయ వృతికే కలంకం తెచ్చాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు.. విచక్షణ మరచి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘోరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో చోటుచేసుకుంది. విద్యార్థినికి ప్రేమ లేఖలు రాసి వేధించడంతో పాటు వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
READ ALSO: RGV – Sandeep Reddy : ఆర్జీవీ ఒక సైతాన్.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్
విద్యార్థినికి ప్రేమ లేఖలు..
అలీఘర్ జవాన్ బ్లాక్‌లోని ఒక గ్రామంలో ఈ సంఘటన వెలుగు చూసింది. ఇక్కడి తాలివ్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ షకీల్ అహ్మద్, అదే స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ విద్యార్థి భయపడి ఇంటికి చేరుకున్న తర్వాత ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. వెంటనే బాధితురాలి తల్లి డీఎం, ఎస్పీలను కలిసి ఘటనపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ప్రిన్సిపాల్ షకీల్ అహ్మద్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. అదే సమయంలో బాధిత విద్యార్థినిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈసందర్భంగా బాధిత విద్యార్థిని తల్లి మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్ తన బిడ్డకు ప్రేమ లేఖలు రాసి వేధించాడని, వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడని కన్నీటిపర్యంతం అయ్యింది. ఎవరికీ చెప్పకుండా తన బిడ్డను ప్రిన్సిపాల్ బెదిరింపులకు గురి చేశారని చెప్పింది. దాంతో ఆమె చాలా భయపడిందని, ఘటన జరిగిన రోజు కూడా తను చాలా సేపు నార్మల్ కాలేకపోయిందని, తనను చాలా సేపు అడిగిన తర్వాత, మొత్తం కథను చెప్పిందని వాపోయింది.
ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకున్నారు. నిందితుడైన ప్రిన్సిపాల్ షకీల్ అహ్మద్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయనను టీచర్ సేవల నుంచి పూర్తిగా తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
READ ALSO: Bengaluru Crime: బెంగళూరులో ఘోరం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మాజీ ప్రియుడు..
