NTV Telugu Site icon

Uttar Pradesh: పెళ్లి ఆగిపోవడంతో మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం.. నిందితుల్లో మౌలానా….

Up Incident

Up Incident

Uttar Pradesh: దేశంలో అత్యాచారాలకు అడ్డుకట్టపడటం లేదు. నిర్భయ, పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నా కూడా కామాంధులు బరి తెగిస్తున్నారు. మహిళలపై ముఖ్యంగా అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే పెళ్లి ఆగిపోయడంతో ఓ యువకుడు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, రేప్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

Read Also: Himanshu : గొప్ప మనసు చాటుకున్న కేసీఆర్‌ మనవడు.. రూ. కోటితో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేసిన హిమన్షు

వివరాల్లోకి వెళ్తే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బందా జిల్లాలో ఓ వ్యక్తి 11 ఏళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేశాడు. ఈ కేసులో నిందితుడు, ముస్లి మతగురువు(మౌలానా)తో సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సాహిల్ తో మైనర్ బాలికకు వివాహం ముందుగానే నిశ్చయమైంది. అయితే కొన్ని కారణాల వల్ల వివాహం ఆగిపోయింది.

ఈ ఘటనలో కోపం పెంచుకున్న సాహిత్ తన బంధువుల సహాయంతో మైనర్ బాలికను ఆమె ఇంటి నుంచి కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. జూలై 7న ఈ ఘటన జరిగింది. బాలిక కుటుంబీకులు ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. తొలుత పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. మైనర్ బాలిక వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులను బుధవారం కోర్టులో హాజరుపరచనున్నారు.

Show comments