Site icon NTV Telugu

Man Kills Sister: బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడినందుకు సోదరిని చంపిన వ్యక్తి..

Crime

Crime

Man Kills Sister: తన సోదరి బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడటాన్ని సహించలేని సోదరుడు, ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లాలోని ఇటోరా గోటియా గ్రామంలో జరిగింది. బాధితురాలిని నైనా దేవీ(22)గా గుర్తించారు. ఎస్పీ రాజేష్ ద్వివేది ఈ హత్య గురించిన వివరాలు వెల్లడించారు. నిందితుడు షేర్ సింగ్ తన సోదరి చాలా మంది పురుషులతో ఫోన్‌లో మాట్లాడిందని, వివాహ ప్రతిపాదనల్ని కూడా తిరస్కరించిందని చెప్పాడు.

Read Also: Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై బంగ్లా అభ్యర్థనను పరిశీలిస్తున్నాం: భారత్..

ఆమె ఫోన్ రికార్డింగ్స్ విన్న తర్వాత కోపంతో ఈ హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు వెల్లడించాడు. ఆమె తన ఫోన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు కోపంతో నిందితుడు ఆమె మెడపై ఆయుధంతో పొడిచి చంపినట్లు పోలీస్ అధికారులు చెప్పారు. నిందితుడు షేర్ సింగ్‌ను మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. హత్యానేరం కింద జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

Exit mobile version