NTV Telugu Site icon

Fraud: హిందువుగా నటించి మహిళతో పెళ్లి.. ఆ తర్వాత మతం మారాలని ఒత్తిడి..

Up

Up

Fraud: హిందువుగా నటించి ఓ మహిళని పెళ్లి చేసుకున్న తర్వాత మతం మారాలంటూ ఒత్తిడి చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 35 ఏళ్ల వ్యక్తి హిందువుగా చెప్పుకుంటూ మోసం చేశాడు. ఆ తర్వాత ఇస్లాంలోకి మారాలని సదరు మహిళని బలవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. 32 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బారాబంకీలో జరిగింది.

Read Also: YS Jagan: గవర్నమెంట్‌ స్కూలు పిల్లల విషయంలో వివక్ష ఎందుకు?.. జగన్ తీవ్ర విమర్శలు

ప్రాపర్టీ డీలర్, కాంట్రాక్టర్ అయిన మహ్మద్ అజం జైదీ అనే వ్యక్తిని ఆదివారం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత జైలుకు తరలించారు. 2016లో అమన్ అనే పేరు పెట్టుకున్న జైదీ తనను హిందువుగా మోసం చేసి పెళ్లి చేసుకున్నట్లు మహిళ ఆరోపించింది. తన భర్త నిజస్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత, మహిళ బెదిరింపులు మరియు లైంగిక వేధింపులను ఎదుర్కొందని అధికారి తెలిపారు.

ఫిర్యాదు తర్వాత చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సుధా సింగ్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జైదీపై ఐపిసి సెక్షన్‌లు 498A (భార్య పట్ల క్రూరత్వం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశ్యంతో అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపు) మరియు 376 (అత్యాచారం) కింద కేసు నమోదు చేశారు. యూపీ చట్టవిరుద్ధమైన మతమార్పిడి నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేశారు. 2017లో కూతురికి జన్మనిచ్చిన మహిళపై పలు సార్లు దాడి చేయడంతో పాటు కూతురు పుట్టిన తర్వాత ఇస్లాంలోకి మారాలని బాధితురాలిపై జైదీ ఒత్తిడి చేయడం ప్రారంభించాడని కొత్వాలి ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ అజయ్ కుమార్ త్రిపాఠి తెలిపారు. కేసు నమోదైన 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేశామని చెప్పారు.

Show comments