Site icon NTV Telugu

Extra Marital Affairs: ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధాలు.. ఒక చోట భార్య, మరోచోట భర్త హత్య..

Crime News

Crime News

Illicit affairs: వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు హత్యలకు కారణం అవుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక చోట భర్తను హత్య చేస్తే, మరో సంఘటనలో భార్య హత్యకు గురైంది.

లక్నోలో పోలీస్ ఇన్స్‌పెక్టర్‌ని భార్య, బావమరిది కలిసి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్ సింగ్ అనే వ్యక్తిని అతని భార్య, ఆమె సోదరుడు దేవేంద్ర కుమార్ వర్మ కలిసి గత ఆదివారం రాత్రి హత్య చేశారు. అక్రమ సంబంధాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగింది.

ఇన్‌స్పెక్టర్ సతీష్ సింగ్ అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చినట్లు పోలీస్ అధికారి తెలిపారు. సతీష్ సింగ్ భార్య భావనా సింగ్, అతనికి మధ్య ఈ అక్రమ సంబంధాల నేపథ్యంలో గొడవలు జరుగుతుండేవని, సోదరి బాధ చూడలేక దేవేంద్ర కుమార్ సతీష్ సింగ్ హత్యకు ప్లాన్ చేశాడు. ఇద్దరు కలిసి అతడిని హత్య చేసినట్లు లక్నో సౌత్ డీసీపీ వినీత్ జైస్వాల్ చెప్పారు.

పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నిందితులు సైకిల్ కొని హుడీ టీషర్ట్ ధరించి ఈ ఘటనకు పాల్పడ్డారు. 10 కిలోమీటర్ల పరిధిలోని 400 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను పట్టుకున్నట్లు వెల్లడించారు.

లవర్‌తో పట్టుబడ్డ భార్యను కాల్చి చంపాడు:

బరేలీ జిల్లాలోని గోటియా గ్రామంలో 35 ఏళ్ల మహిళ మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చూసిన భర్త ఆమెను కాల్చి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. షాహి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ సమీపంలోని పొలంలో శనివారం అర్థరాత్రి కాలిపోయిన అంజలి మృతదేహం లభ్యమైంది.

అంజలిని సజీవ దహనం చేశాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించడంతో హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అంజలి భర్త నేపాల్ సింగ్ హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉండటంతోనే చంపినట్లు ఒప్పుకున్నాడు.

 

 

Exit mobile version