Gambling: జూదానికి బానిసైన ఓ వ్యక్తి ఏకంగా తన భార్యనే పణంగా పెట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. వ్యక్తి తన స్నేహితులతో జూదం ఆడుతూ భార్యతో పాటు ముగ్గురు చిన్న పిల్లల్ని కూడా పందెంకాశాడు. ఆమె పట్ల దారుణంగా వ్యవహరించాడు. భార్యపై స్నేహితులు లైంగిక వేధింపులకు అనుమతినిచ్చాడు. ఆమె తన తల్లి ఇంటికి వెళ్లి రావడానికి నిరాకరించడంతో సదరు వ్యక్తి, ఆమెని కొట్టడమే కాకుండా వేలు విరిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Kejriwal: లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..!
యూపీ రాంపూర్‌లోని షహబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న మహిళకి 2013లో నిందితుడితో వివాహం జరిగింది. ఈ ఘటన తర్వాత బాధిత మహిళ తన వేధింపుల గురించి చెప్పింది. తన అత్త, భర్త కట్నం కోసం వేధించేవారని, భర్త మద్యం, జూదానికి బానిసయ్యాడని సుమారు 7 ఎకరాల భూమిని పోగొట్టుకున్నట్లు చెప్పింది. అతని స్నేహితుల వద్ద తనను కూడా పణంగా పెట్టాడని చెప్పింది. ఈ వేధింపులు భరించలేదక 112 మహిళా హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేశానని, పోలీసులు రావడంతో పారిపోయాడని చెప్పింది.
తనను లైంగికంగా వేధించడానికి కూడా తన భర్త, అతడి స్నేహితులకు అనుమతినిచ్చాడని చెప్పింది. తనకు నీళ్లు ఇవ్వకుండా, స్నేహితుల ముందే కొట్టినట్లు చెప్పింది. తాను తన తల్లి ఇంటికి వెళ్లి సెప్టెంబర్ 04న వచ్చానని, అతని స్నేహితులు, నావేలు విరిచి తనను ఇంటి నుంచి బటయకు లాగేందుకు యత్నించారని చెప్పింది. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, నా భర్త, అతడి స్నేహితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాంపూర్ ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా తెలిపారు. బాధిత మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టులో వెల్లడిస్తానని చెప్పింది.