Rajasthan: మద్యపానం చాలా కుటుంబాల్లో నిప్పులు పోస్తోంది. మద్యపానం అలవాటు వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవడమే కాకుండా, ఆత్మహత్యలు, హత్యలకు దారి తీస్తున్నాయి. భార్యభర్తల మధ్య గొడవలకు మధ్యపానం కారణం అవుతోంది. క్షణికావేశం వల్ల కుటుంబాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఇలాంటి గొడవ కారణంగా భర్త సూసైడ్ చేసుకున్నాడు.
Read Also: Iraq Transportation Project: యూరప్‌ను ఆసియాతో అనుసంధానించడానికి ఇరాక్ మెగా ప్లాన్
మద్యపానం అలవాటు ఉందని భర్తను భార్య వేధించడంతో రాజస్థాన్ భరత్ పూర్ జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టాయిలెట్ క్లీనర్ తాగి చనిపోయాడు. కుమహేర్ కు చెందిన వినోద్ నిత్యం మద్యం సేవించే అలవాటు ఉంది. దీనిపై భార్యభర్తలకు తరుచుగా గొడవలు జరిగేవి. భర్త మద్యం తాగి రావడంతో మరోసారి భార్య మందలించింది. దీంతో ఆగ్రహించిన వ్యక్తి తన గదిలోకి వెల్లి టాయిలెట్ క్లీనర్ సేవించాడు.
ఆ తర్వాత అతని సోదరి గదిలోకి వెళ్లి చూసే సరికి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. భరత్ పూర్ లోని ఆర్‌బీఎం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
