Site icon NTV Telugu

Nellore Incident: నెల్లూరు జైలు దగ్గర దారుణం.. కత్తితో దాడి

క్షణికావేశంతో ఘోరాలు జరుగుతున్నాయి. నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్య గురయ్యారు నెల్లూరు నగరంలోని పాత జిల్లా కేంద్ర కారాగారం వద్ద నివాసం ఉంటున్నారు . స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు మద్యం సేవించేందుకు వచ్చి సుల్తాన్ తో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో సుల్తాన్ పై కత్తితో, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో సుల్తాన్ మరణించాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈఘటన గురించి మరిచిపోకముందే.. మరో ఘటనలో నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరు పల్లి దళితవాడలో మరో వ్యక్తి హత్యకు గురయ్యాడు.

మోసెస్ అనే వ్యక్తి పెయింటింగ్ పనులు నిర్వహిస్తూ చేసుకుంటూ అక్కడ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యా పిల్లలకు దూరంగా ఉంటూ ఒక మహిళతో వివాహేతర సంబంధాన్ని సాగిస్తున్నాడు. గతంలో ఈ మహిళకు సన్నిహితంగా ఉన్న ప్రదీప్ అనే వ్యక్తికి మోసెస్ కు వివాదాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో మహిళతో మోసెస్ ఉన్న సమయంలో ప్రదీప్ వాగ్వాదానికి దిగాడు. మోసెస్ పై కత్తితో దాడి చేయడంతో మోసెస్ అక్కడికక్కడే మరణించాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నెల్లూరు నగర పరిధిలో ఇటీవల కాలంలో హత్యలు అధికం కావడంతో ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, శాంతిభద్రతల్ని కాపాడాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.

మరోవైపు నెల్లూరు నగరం మూలాపేట లో జరిగిన సుల్తాన్ హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

Read Also: Traffic Restrictions in Cyberabad: రేపు సైబ‌రాబాద్ ప‌రిధిలో ట్రాఫిక్ ఆంక్షలు..

Exit mobile version