NTV Telugu Site icon

Wives Eloped With Lovers: భర్తల్ని పని కోసం విదేశాలకు పంపి.. లవర్లతో భార్యలు జంప్

Wives Loped Lovers

Wives Loped Lovers

Two Bihari Wives Eloped With Their Lovers After Their Husband Went To Foreign For Works: వివాహేతర సంబంధాల మోజులో కొందరు మహిళలు తమ కాపురాల్ని కూల్చుకుంటున్నారు. పరువు, మర్యాదల్ని పట్టించుకోకుండా.. తమ లవర్లతో పారిపోతున్నారు. తాము చేస్తోంది తప్పని తెలిసినా.. కామంతో కళ్లు మూసుకుపోయి బరితెగించేస్తున్నారు. తాజాగా ఇద్దరు మహిళలు కూడా అదే పని చేశారు. తమ భర్తల్ని పనుల కోసం విదేశాలకు పంపించి.. తమ లవర్లతో జంప్ అయ్యారు. పాపం ఆ భర్తలు.. ఎంతో ప్రేమగా తమ భార్యల్ని చూసుకుంటే, వాళ్లు నిండా మోసం చేసి పరారయ్యారు. బీహార్‌లోని రెండు వేర్వేరు గ్రామాల్లో ఈ ‘జంపింగ్ జపాంగ్’ వ్యవహారాలు చూడగా.. ఒకే పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.

CM Jagan: గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ ఒప్పందాల అమలుపై సీఎం జగన్ సమావేశం.. అధికారులకి కీలక ఆదేశాలు

తొలుత మొదటి కేసు గురించి మాట్లాడుకుంటే.. ఓ వివాహిత తన భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలేసి మేనల్లుడితోనే పరారయ్యింది. పెళ్లయ్యాక తన భార్య చదువుకుంటానని మొండికేయడంతో, తాను ఆమెను పారామెడికల్ కాలేజీలో చేర్పించానన్నాడు. భార్య చదువు, ఇంటి ఖర్చుల కోసం డబ్బులు సంపాదించడానికి భర్త విదేశాలకు వెళ్లాడు. భర్త పంపించిన డబ్బులతో చదువుకున్న భార్యకు.. ఏఎన్ఎం ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరాక.. ఆమె తన మేనల్లుడికి దగ్గరయ్యింది. ఈ క్రమంలోనే అతనితో ప్రేమలో పడింది. కొన్నాళ్లు రహస్యంగా తమ రాసలీలలు కొనసాగించారు. ఇక జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకొని.. ఆ ఇద్దరు ఉడాయించారు. ఈ ఘటనపై భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పక్క జిల్లాకు చెందినది అయినా.. తాము విచారణ చేపడతామని పోలీసులు హామీ ఇచ్చారు.

S** Harassment:‘మేడం మీ ఫిగర్ సూపర్’ అన్నా లైంగిక వేధింపే.. బీ కేర్ ఫుల్..

ఇక రెండో కేసు విషయానికొస్తే.. ఇది చుటియా-బళ్లారి గ్రామానికి చెందినది. ఇక్కడ భార్య.. తన భర్త, కూతురు, అత్తారింటిని వదిలేసి ప్రియుడితో పారిపోయింది. నెల రోజుల క్రితమే భర్త ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాడు. తాను మీర్జాపూర్ మార్కెట్‌కి వెళ్లొస్తానని ఆ మహిళ తన అత్తమామలకు చెప్పి, ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అంతే.. మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయాన్ని విదేశాల్లో ఉన్న భర్తకి తెలియగా.. అతడు హుటాహుటిన దేశానికి తిరిగొచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ రెండు కేసుల్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show comments