Site icon NTV Telugu

Guntur Incident: గుంటూరులో బాలికపై అఘాయిత్యం

Assault

Assault

ఎన్ని చట్టాలు వచ్చినా.. మహిళలు, స్కూలు పిల్లలపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఇద్దరు కామాంధులు బాలికపై దారుణానికి పాల్పడ్డారు. బాలిక అని కూడా చూడకుండా అత్యాచారానికి పాల్పడ్డారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ అత్యాచార ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 27వ తేదీన 14 యేళ్ల బాలిక రాత్రి 7 గంటల సమయంలో ఇంటి బయటకు వెళ్లి ఆ తర్వాత మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు.

Read Also: Botsa Satyanarayana: టీచర్ల సంఘాలతో ముగిసిన మంత్రి బొత్స భేటీ

దీంతో ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి ఆ బాలిక ఆచూకీని తెలుసుకున్నారు. ఆ బాలికను నాని అనే యువకుడు అత్యాచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. 27వ తేదీన బాలికను తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నాని అక్కడ బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలికను ఇంటి సమీపంలో రాత్రిపూట వదిలి వెళ్లిపోయాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ బాలికను చేరదీసి మరోమారు అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలి వద్ద పోలీసులు జరిపిన విచారణలో వెల్లడించింది. దీంతో నాని, జగన్మోహన్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.

Read Also: Nirmala Sitharaman: తెలంగాణలో అప్పుడే పుట్టిన బాబు కూడా అప్పు కట్టాల్సిన పరిస్థితి

Exit mobile version