RMP Murder Case: కొలిమిగుండ్లలో ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్య ఘటనలో కీలక మలుపు తిరిగింది.. హత్య చేసి చంపింది మేమే నని మీడియా ముందు అంగీకరించారు నిందితులు.. మృతదేహాన్ని బైక్ మీద తీసుకెళ్లి గాలేరు నగరి కాలువలో పడేశామని వెల్లడించారు.. డాక్టర్ ఒంటి మీదున్న బంగారు గొలుసు, రెండు ఉంగరాలు పోలీసులకు అప్పగించారు.. అయితే, నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గ్రామంలో జరిగిన ఆర్ఎంపీ డాక్టర్ కొండయ్య హత్య ఘటనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసినట్టు అయ్యింది..
లీసులు చేపట్టిన విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి, బెలుం సింగవరంలోని గాలేరు నగరి కాలువ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో గల పొలం వద్ద 70 ఏళ్ల వయసున్న దొనపాటి ఆనంద రెడ్డి, 65 ఏళ్ల వయసున్న మహేశ్వరమ్మ అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు.. అయితే, ఆర్ఎంపీ డాక్టర్ కొండయ్యను చంపింది మేమే నంటూ నిందితులు మీడియా ముందు అంగీకరించారు.. తమ కుమారుడు విశ్వనాథరెడ్డి, ఆర్ఎంపీ డాక్టర్ కొండయ్య కు ఫోన్ చేసి చికిత్స చేయాలంటూ ఇక్కడికి రప్పించి తలపై కర్రతో బలంగా కొట్టామని.. దీంతో.. అక్కడి కక్కడే కుప్ప కూలి పడిపోయి చనిపోయాడని తెలిపారు.. ఇక, చనిపోయిన కొండయ్య ను తమ కుమారుడే మోటర్ బైక్ మీద తీసుకెళ్లి గాలేరు నగరి కాలువలో పడేసి నట్లు ఒప్పుకున్నారు. కొండయ్య, మెడ లో వేసుకున్న ఒక బంగారు గొలుసు తో పాటు, చేతిలో ఉన్న రెండు ఉంగరాల ను తామే తీసుకున్నట్లు చెప్పారు.. పోలీసులు తమను తీసుకెళ్లి విచారణ చేయడంతో అన్ని విషయాలు పోలీసులకు కూడా చెప్పామని, తాము తీసుకున్న బంగారు ఆభరణాలను పోలీసులకు తిరిగి అప్పగించినట్లు వెల్లడించారు. మృతుని భార్య వెంకటేశ్వరి ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసుకొని పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు వెల్లడించారు.