Triple Murder Case: కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ కేసు కలకలం రేపుతుంది. తల్లి మాధురి, ఇద్దరు కూతుర్లు కుమారి ,జెస్సీలను అతి కిరాతకంగా గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. తలపై సుత్తితో కొట్టి ముగ్గురిని దుండగులు హత్య చేశారు. అలాగే, తొడల దగ్గర బ్లేడుతో పోసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే, మాధురి భర్త ప్రసాద్ బొలెరో డ్రైవర్.. రాత్రి డ్యూటీకి వెళ్లి ఉదయం వచ్చి చూసేసరికి ముగ్గురు రక్తపు మడుగులో ఉన్నారని చెప్పుకొచ్చాడు.
Read Also: MLC Kavitha: రేపటి నుంచే దీక్ష.. 72 గంటలపాటు నీళ్లు కూడా తాగకుండా..
ఇక, భార్య, పిల్లలు తలుపులు తీయకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలిచి తాళాలు పగలగొట్టి భర్త ప్రసాద్ ఇంటి లోపలికి వెళ్ళాడు. విషయం తెలుసుకున్న పోలీసులు భర్త ప్రసాద్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అలాగే, ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త చంపాడా? వేరే ఎవరైనా చంపారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
