Site icon NTV Telugu

Tirupati Girl De*ath Case Twist: రీల్స్‌ చేస్తూ బాలిక మృతిచెందిన కేసులో సంచలన ట్విస్ట్.. వెలుగులోకి కీలక అంశాలు..

Crime

Crime

Tirupati Girl De*ath Case Twist: తిరుపతిలో 13 బాలిక రీల్స్ చేస్తూ మృతి చెందిన కేసులో సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మొదట అనుమానాస్పదంగా కనిపించిన ఈ ఘటనలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. సోమవారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన బాలిక పుష్ప కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మొదట రీల్స్ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోయిందని తల్లి పోలీసులకు తెలిపిన విషయం తెలిసిందే. అయితే, విచారణలో భాగంగా కుటుంబ సభ్యులను ప్రశ్నించిన పోలీసులు కీలక వివరాలను సేకరించారు. వరుసకు అన్నయ్య అయ్యే ఓ యువకుడిని పుష్ప ప్రేమిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై తల్లి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసి, కూతురిని మందలించినట్లు తెలుస్తోంది. తల్లి మందలింపుతో తీవ్ర మనస్తాపానికి గురైన పుష్ప, ఆవేశంలో ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మొదట ప్రమాదవశాత్తు పడిపోయిందని చెప్పినా, ఇప్పుడు ప్రేమ వ్యవహారం కారణమనే కోణం వెలుగులోకి రావడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది.

Read Also: Crime: భార్యను చంపి పరారీ.. LPG సిలిండర్ బుకింగ్‌లో పట్టుబడ్డ నిందితుడు..

Exit mobile version