NTV Telugu Site icon

Tirupathi : బాణాసంచా కేంద్రంలో మంటలు.. ముగ్గురు సజీవదహనం..

Tirupathi

Tirupathi

ఏపీ లోని తిరుపతి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.. వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లిలో భారీగా అగ్నిప్రమాదం జరిగింది.. బాణాసంచా చేస్తున్న తయారీ కేంద్రంలో మంటలు ఎగిసిపడుతున్నాయి.. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అందులో తయారు చేస్తున్న వారు బయటకు రాలేక పోయారు..

ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు, క్షతగాత్రులను సూళ్లూరు పేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..

అయితే ప్రమాదం జరుగుతున్న సమయంలో కార్మాగారం లో ఆరుగురు కూలీలు తమ పనులు చేస్తున్నారు..రోజువారి పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. ప్రమాదం ఎలా జరిగిందనే కోణం లో దర్యాప్తు ప్రారంభించారు.. ఒక్కేసారి ముగ్గురు చనిపోవడంతో స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.. ముగ్గురుకు డాక్టర్లు వైద్యాన్ని అందిస్తున్నారు.. మరింత సమాచారం తెలియాల్సి ఉంది..

Show comments