Site icon NTV Telugu

లవర్ ని పబ్ కి తీసుకువచ్చి ఆ పని చేసిన ప్రియుడు..

spoil pub

spoil pub

జూబ్లీహిల్స్ స్పాయిల్ పబ్ లో దారుణం చోటు చేసుకోంది. యువతిని మాట్లాడదామని పిలిచి ఆమెపై దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి. కూకట్ పల్లి కి చెందిన బిజిన్ అనే యువకుడు.. ఒక బ్యూటిషన్ తో రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్నాడు. ఇటీవల వీరి మధ్య గొడవలు రావడంతో ఇద్దరు విడిగా ఉంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ నెల 11 న మాట్లాడుకొందామని బంజారాహిల్స్‌లోని స్పాయిల్ పబ్‌ కి రప్పించాడు. ఆమె వచ్చాకా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అమ్మాయి అని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టాడు.

https://ntvtelugu.com/young-women-commits-suicide-in-hyderabad/

అనంతరం పబ్ నుంచి బయటికి గెంటేశాడు. ఇక ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను అక్కడ ఉన్నవారు ఆసుపత్రికి తరలించారు. ఇక తాజాగా దెబ్బల నుంచి కోలుకున్న ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు,

Exit mobile version