Assam: కుటుంబ వివాదం కారణంగా ఓ వ్యక్తి దారుణ చర్యకు పాల్పడ్డాడు. అస్సాంకు చెందిన వ్యక్తి భార్య తల నరికి, ఆ తలతో పోలీస్ స్టేషన్‌కి వచ్చి లొంగిపోయాడు. ఈ సంఘటన రాష్ట్రంలోని చిరాంగ్ జిల్లాలో జరిగింది. 60 ఏళ్ల బితీష్ హజోంగ్ తన భార్య బజంతి తల నరికి, ఆ తలను తన సైకిల్‌పై పెట్టుకుని, బల్లమ్‌గురి అవుట్ పోస్ట్ పోలీసుల ముందు లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు.
Read Also: UP techie Suicide: ‘‘అమ్మా నాన్న క్షమించండి’’.. భార్య వేధింపులకు మరో వ్యక్తి ఆత్మహత్య..
పోలీస్ స్టేషన్‌కి వచ్చిన తర్వాత అతడి సైకిల్ మొత్తం రక్తంతో తడిసిపోయింది. ఒక్కసారిగా ఈ సంఘటన చూసి అక్కడ ఉన్నవాళ్లంతా షాక్‌కి గురయ్యారు. నిందితుడు దినసరి కూలీ అని, దంపతుల మధ్య కుటుంబ కలహాల కారణంగానే అతడు భార్య తల నరికి చంపాడని పోలీసు వర్గాలు తెలిపాయి.
బితీష్ హజోంగ్ శనివారం రాత్రి పని నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత గొడవ ప్రారంభమైన తర్వాత హత్య జరిగిందని ఇరుగుపొరుగు వారు చెప్పారు. భార్యభర్తలిద్దరూ చిన్న చిన్న విషయాలకు ప్రతీ రోజూ గొడవ పడుతుండే వారని చెప్పారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి తరలించిన పోలీసులు, తదుపరి విచారణ చేపట్టారు.
