Site icon NTV Telugu

పరువు పోతుందని కుటుంబం ఆత్మహత్య.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే.!

కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది.. పరువు పోతుందని కుటుంబం మొత్తం విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కోలార్ గ్రామానికి చెందిన ఒక యువతి , యువకుడు ప్రేమించుకున్నారు.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని తెలిసి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచారు. అంతలోనే ఆ యువతి గర్భం దాల్చింది. ఇంట్లో ఈ విషయం తెలిస్తే చంపేస్తారని చదువు పేరిట బయటికి వెళ్లి బిడ్డ పుట్టాకా ఇంటికి చేరుకుంది యువతి. అయితే ఆ బిడ్డను పుష్ప అనే మహిళ వద్ద ఉంచి పెంచమని డబ్బులు ఇచ్చారు భార్యాభర్తలు. ఇరు కుటుంబాలు తాం పెళ్లిని ఒప్పుకున్నాకా బిడ్డను తీసుకెళ్తామని తెలిపారు.

కొన్నాళ్ల తరువాత బిడ్డను తిరిగి ఇవ్వాల్సిందిగా దంపతులు పుష్పను కోరగా.. ఆమె ప్లేట్ పిరాయించింది.. బిడ్డ ఏంటీ..? అసలు ఎవరు మీరు..? అనేసరికి షాకయ్యిన దంపతులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాం బిడ్డను తమకు అప్పగించాల్సిందిగా పోలీసులను కోరారు. ఇక ఏ విషయం తెలుసుకున్న పుష్ప,ఆమె కుటుంబం పోలీసులు ఇంటికి వస్తే పరువు పోతుందని భావించి అందరు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఎవరు పలకడంలేదని చుట్టుపక్కలవారు వెళ్లి చూడగా ఐదుగురు విగత జీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అస్సలు పుష్పకు యువతి చిన్నారిని ఇచ్చిందా..? ఇస్తే వారు ఆ చిన్నారిని ఏం చేశారు..? ఎందుకు ఆమె అబద్దం చెప్తోంది..? ఒకవేళ అదే నిజమైతే పోలీసులు వస్తారని భయపడడం ఎందుకు..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Exit mobile version