NTV Telugu Site icon

Medak Crime: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని హత్య చేసిన కొడుకు

Mdk Murder

Mdk Murder

మద్యం తాగేందుకు తల్లిని డబ్బులు అడిగే ఇవ్వకపోవడంతో కుమారుడు కృరంగా మారాడు.. డబ్బులు ఇవ్వడం లేదంటూ కోపంతో తల్లిని కొడవలి‌తో కొట్టి చంపిన ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం తొగిటలో ఇవాళ (శుక్రవారం) జరిగింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. తోగిట గ్రామానికి చెందిన పుస్థి నర్సమ్మ వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆమెకు ఇద్దరి పిల్లలు భాను ప్రసాద్, బాలు ఉన్నారు.

Read Also: Janhvi Kapoor : ఎన్టీఆర్ తో నటించడం కోసం ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న హాట్ బ్యూటీ..

అయితే, భాను ప్రసాద్ నిన్న (గురువారం) రాత్రి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తల్లిని అడిగారు.. ప్రతి సారి డబ్బుల కోసం వేదిస్తుండడంతో మనీ ఇచ్చేందుకు ఆమె నిరాకరించింది. దీంతో తల్లి కొడుకుల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇక, కోపంతో ఊగిపోయిన కొడుకు భాను ప్రసాద్ తల్లిపై కొడవలితో దాడి చేయగా తీవ్ర గాయాలైన ఆమె రక్తపు మడుగుల్లో కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది. విషయం తెలుసుకున్న హావేలి ఘనపూర్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Snake In Rtc Bus: అమ్మో ఆర్టీసి బస్సులో పాము.. ప్రయాణికులు షాక్

ఐదు సంవత్సరాల క్రితం భాను ప్రసాద్ తో కలిసి నరసమ్మ తన తల్లిని బాలమ్మను ఆస్తికోసం ఇంటిపై నుంచి తోసేసి హత్య చేసిన కేసులో జైలుకెళ్లి వచ్చిన భానుప్రసాద్.. మళ్లీ ఇప్పుడు మద్యం కోసం తల్లిని చంపడంపై స్థానికంగా ఈ హత్యలపై చర్చించుకుంటున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.