ప్రజలకు సమస్యలు వస్తే పోలీసుల వద్దకు వెళ్తారు. అదే పొలుసులు సమస్యలు తెస్తే ఎక్కడికి వెళ్ళాలి. కామంతో కళ్ళుమూసుకుపోయి బాధ్యత కలిగిన వృత్తిలో ఉన్నామని కూడా మరిచాడు ఆ పోలీస్ .. సమస్య ఉండి ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ సమస్య తీర్చాల్సింది పోయి ఆమెపై నీచానికి ఒడిగట్టాడు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళనుపై అత్యచారానికి పాల్పడి, గర్భవతిని చేసిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కళియకోవిలై పోలీస్ స్టేషన్ లో సుందర లింగం(40) ఎస్సై గా విధులు నిర్వహిస్తున్నాడు.ఇటీవల అతని పోలీస్ స్టేషన్ కి ఒక మహిళా ఫిర్యాదు చేయడానికి వచ్చింది. తన రెండో భర్త తనను తగి వచ్చి కొడుతున్నాడని, తనను, తన కూతురిని వేధిస్తున్నాడని తెలుపుతూ ఫిర్యాదు ఇచ్చింది. ఇక కేసు నమోదు చేసుకున్న సుందర లింగం ఆమెను ఏదో ఒక కారణం చేత రోజు స్టేషన్ కి పిలిపించుకొని ఆమెతో మాటలు కలిపాడు.. కొన్నిరోజులు మాటలు తరువాత ఒకరోజు నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి నీకు న్యాయం చేస్తానని మాయమాటలు చెప్పిఆమెపై అత్యచారానికి పాల్పడ్డాడు.
న్యాయం జరుగుతుందని చెప్పడంతో ఆమె రోజు స్టేషన్ కి వెళ్లి అతడిని కలిసేది. ఇక కొన్నిరోజులు ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్నీ ఎస్సై కి చెప్పడంతో ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లి ఆమెకు తెలియకుండా అబార్షన్ చేయించాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న మహిళ, ఎస్సై తనను మోసం చేశాడని తెలుసుకొని అతడిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుందర లింగంపై విచారణ చేపట్టారు.
