Site icon NTV Telugu

దారుణం : వికలాంగుడిని హత్య చేసిన మావోయిస్టులు..

ఛత్తీస్‌గఢ్‌లో మొన్నటికి మొన్న ఓ మాజీ ఉప సర్పంచ్‌ను మావోయిస్టులు హత్య చేసిన ఘటనను మరవకముందే మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ మానసిక వికలాంగుడు పోలీస్‌ ఇన్ఫార్మర్‌గా పని చేస్తున్నాడని అతడిని బీజాపూర్‌ జిల్లా బాసగూడలో హత్య చేశారు. అయితే గతంలోనూ మాజీ ఉప సర్పంచ్‌ను కూడా పోలీసులకు ఇన్ఫార్మర్‌గా పనిచేస్తున్నాడనే నేపంతో ప్రజా కోర్టు శిక్షించినట్లు మావోయిస్టులు తెలిపారు.

ఇప్పుడు తాజాగా ఓ వికలాంగుడు పోలీసులకు మావోయిస్టుల సమాచారం అందిస్తున్నాడనే ఆరోపణతో జన మిలీషియా సభ్యులు ఆ వికలాంగుడిని హత్య చేశారు. అయితే ఆ వికలాంగుడి కుటుంబ సభ్యలకు ఈ విషయం తెలియడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version