Site icon NTV Telugu

కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారుల అత్యుత్సాహం..

ప్రభుత్వం ప్రెంఢ్లీ పోలీసింగ్‌, ప్రెండ్లీ సర్వీస్‌ అంటూ అన్ని శాఖల్లో పారదర్శకత, ఉండాలని ప్రజలకు మెరుగైనా సేవలను అందించాలని పదే పదే చెబుతున్నా అక్కడక్కడ అధికారుల తొందరపాటు చర్యలకు సామాన్యులు బలి అవుతున్నారు. తాజాగా కమర్షియల్ టాక్స్ అధికారుల అత్యుత్సాహానికి డీసీఎం డ్రైవర్‌ మృతి చెందిన సంఘటన భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది.

https://ntvtelugu.com/ministers-congratulate-errol-srinivas/

స్క్రాప్‌ లోడ్‌తో గుంటూరు నుంచి గజ్వేల్‌ వెళ్తున్న డీసీఎం డ్రైవర్ నబీలాల్‌ను అధికారులు ట్యాక్స్‌ డబ్బులు కట్టాలని ఒత్తిడి చేసి కొట్టడంతో డ్రైవర్‌ మృతి చెందాడు. డ్రైవర్‌ నబీలాల్‌ను తీవ్రంగా కొట్టడంతోనే మృతి చెందినట్టు అతడి బంధువులు పేర్కొంటున్నారు. భువనగిరి కమర్షియల్ టాక్స్ కార్యాలయం ఎదుట నబీలాల్‌ బంధువులు ఆందోళనకు దిగారు. తుర్కపల్లి పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు అధికారులపై కేసు నమోదు చేశారు.

Exit mobile version