ఎవరిని ఎప్పుడు.. ఏ రూపంలో ప్రమాదం వెంటాడుతుందో చెప్పడం కష్టం.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్ని చిన్న సంఘటనలతోనే ప్రాణాలు పోయే సందర్భాలు ఎన్నో ఉంటాయి.. కళ్లలో పెట్టుకుని.. కడపులోని పెట్టుకునే అనే విధంగా.. తమ పిల్లలను తల్లిదండ్రులు చూసుకుంటారు.. వారి ఏది అడిగితే అది.. అన్నట్టుగా తమ స్థాయికి తగ్గట్టు కొనిస్తూనే ఉంటారు.. అయితే, ప్రేమగా కొనిపించినా చాక్లెటే ఓ చిన్నారి ప్రాణాలు తీసింది.. అదేంటి..? చాక్లెట్ ప్రాణాలు తీయడమేంటి? అనే అనుమానం వెంటనే రావొచ్చు.. చాక్లెట్ తో పాటు ఆ చిన్నారి కవర్‌ను కూడా నోట్లు పెట్టుకొని మింగేసే ప్రయత్నం చేయడంతో.. గొంతుకు అడ్డంగా పడి.. ఆ చిన్నారి ప్రాణాలు కూడా పోయాయి.
Read Also: Samantha Martial Arts Training : : సమంత మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్
కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బైందూరు తాలూకా బవళాడిలో ఆరేళ్ల సమన్వి అనే బాలిక.. ఆ స్కూల్‌లో ఫస్ట్ క్లాస్ చదువుతోంది.. ఇంటి నుంచి వెళ్లే ముందు ఆమె తల్లి సుప్రీతా పూజారి చాక్లెట్ ఇచ్చింది.. ఉదయం స్కూల్ బస్సు రావడంతో.. ఆ బస్సు కోసం పరుగులు తీసింది.. అదే సమయంలో నోట్లో చాక్లెట్ కూడా పెట్టుకుంది.. అయితే, స్కూల్ బస్సు ఎక్కాలన్న తొందరలో కవర్ తీయకుండానే చాక్లెట్ మింగేసింది ఆ చిన్నారి.. అది కాస్తా గొంతుకు అడ్డం పడింది.. దీంతో, ఊపిరి ఆడక స్కూల్ బస్సులోనే స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే అదే బస్సులో బైందూరు ఆస్పత్రికి తరలించారు తల్లిదండ్రులు.. కానీ, అప్పటికే ఆ బాలిక ప్రాణాలు పోయినట్టు వైద్యులు తెలిపారు.. ఊహించని ఘటనతో షాక్ తిన్నారు ఆ చిన్నారు తల్లిదండ్రులు.. స్కూల్‌కే వెళ్లనని మారాం చేసిందని.. చాక్లెట్ ఇచ్చిన తర్వాతే స్కూల్‌కు వెళ్లేందుకు అంగీకరించిందని.. అదే తమ కూతురు ప్రాణాలు తీస్తుందని అనుకోలేదని కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇంట్లోంచి బయటికి రాగానే స్కూల్ వ్యాన్ రావడం చూసింది.. హడావిడిగా చిన్నారి చాక్లెట్‌ను తన నోటిలో పెట్టుకుంది.. ఆమె పరిగెత్తినప్పుడు, ఆ అమ్మాయి చాక్లెట్‌ను రేపర్‌తో మింగడంతో ఉక్కిరిబిక్కిరి కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.. స్కూల్ బస్సు డోర్ వద్ద బాలిక కుప్పకూలింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, వాహన డ్రైవర్ ఆమెను బతికించేందుకు ప్రయత్నించి వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా.. ప్రయోజనం లేకుండా పోయిందని.. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే బాలిక మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనతో పాఠశాలకు అధికారులు సెలవు ప్రకటించారు.
