AP Crime: సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలన్న టార్గెట్‌తో కొందరు యువత.. సెటిల్ అయిన పెళ్లిళ్లు కావడంలేదు.. 30 ఏళ్లు దాటిన తర్వాత వారి కష్టాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి.. ఎక్కడికి వెళ్లినా? పెళ్లి ఎప్పుడు అని అడిగేవాళ్లే.. దాంతో.. బంధువుల్లో వెళ్లడానికే చాలా మంది ఇబ్బందిపడుతున్నారు.. ఏదో సినిమాలో పెళ్లిచూపులకు వెళ్లిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం.. తమకు తినుబండారు తీసుకొచ్చిన ఓ చిన్న బాలికను చూసి.. పిల్ల మరీ లేతగా ఉందే..? అంటూనే.. ఏదైతే ఏముందు వేసేద్దాంలే అనే డలాగ్ వదులుతాడు.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. కొందరు 35 ఏళ్లు దాటి.. 40 ఏళ్లు వచ్చిన పెళ్లి కాకపోవడంతో.. ఏదో ఒక పిల్ల అయితే చాలని వెంటనే కమిట్ అవుతున్నారు.. 40 ఏళ్లకు పెళ్లి కుదరడంతో.. ఎగిరి గంతేసి.. వెనకాముందు చూడకుండా.. పెళ్లి చేసుకొని.. వారం రోజుల తర్వాత అసలు విషయం బయటపడడంతో.. ఓ నవ వరుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Read Also: Ram Gopal Varma: మినిస్టర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వండి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆర్జీవీ ట్వీట్..
శ్రీ సత్యసాయి జిల్లాలో పెళ్లి జరిగిన వారానికే వరుడిని మోసగించి వధువు పరారైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హిందూపురం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన వేమారెడ్డి అనే వ్యక్తికి 40 ఏళ్లు వచ్చినా.. ఎక్కడా పెళ్లి కుదరడంలేదు.. ఎన్నో సంబంధాలు చూసి అసలిపోయాడు.. ఏ మ్యారేజ్ బ్రోకర్ కనిపిస్తే.. ఆ బ్రోకర్‌కు తన వివరాలు చెబుతూ.. పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నాలు చేశాడు.. ఇదే సమయంలో.. తన సొంత ప్రాంతాన్ని వీడి.. ఊరుకాని ఊరులో పెళ్లి బ్రోకర్‌ను సంప్రదించాడు.. తల్లిదండ్రుల కోరిక తీర్చేందుకు భీమవరంలోని పెళ్లిళ్ల బ్రోకర్ల ద్వారా భీమవరం సత్యవతి నగర్‌కు చెందిన ఓ మహిళతో ఎట్టకేలకు పెళ్లి కుదిరింది.. వయస్సును సాకుగా చూపడంతో.. ఎదురు కట్నం ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యాడు.. కానీ, బ్రోకర్ల ఉచ్చులో పడుతున్నానని గ్రహించలేకపోయాడు.. ముందే స్కెచ్ వేసిన బ్రోకర్లు.. పెళ్లిచూపులకు వెళ్లి వేమారెడ్డి నుంచి 4 లక్షల రూపాయలు స్పాట్‌లోనే వసూలు చేశారు.. అంతేకాదు.. ఆ వెంటనే ఓ గుడిలో ఆ మహిళతో వేమారెడ్డికి హడావుడిగా పెళ్లిచేసి తంతు ముగించారు.. ఆ తర్వాత తన భార్యను తీసుకుని వేమారెడ్డి తన స్వగ్రామమైన రాచపల్లికి చేరుకున్నాడు.. ఇక, పెళ్లి గుడిలో జరిగిపోవడంతో.. ఆ తర్వాత కార్యాన్ని.. జరిపించడానికి వేమారెడ్డి తల్లిదండ్రులు, బంధువులు సిద్ధమయ్యారు.. కానీ, అసలే ప్లాన్‌తో ఉన్న వధువు.. సాకులు చెబుతూ వారం రోజులు వాయిదే వేస్తూ వచ్చింది..
Read Also: Hassan Nasrallah: మరణించిన ఐదు రోజుల్లోనే.. 100 మందికి పైగా ‘నస్రల్లా’లు జన్మించారు!
ఇక, వారం గడిచిన తర్వాత తన ప్లాన్‌ను అమలు చేయడం మొదలు పెట్టింది వధువు.. తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదని.. వెంటనే తన స్వస్థలం భీమవరం వెళ్లాలని పట్టు పట్టింది. అదేంటి అసలు తల్లిదండ్రులు ఎవరూ లేరని పెళ్లికి ముందే చెప్పావు కదా? అని వేమారెడ్డి.. భార్యను నిలదీశాడు. కానీ, తనను పంపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ పట్టుబట్టింది.. లేకపోతే ఆత్మమత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగింది.. దీంతో.. బిత్తరపోయిన వేమారెడ్డి.. తాను వస్తానంటూ తన భార్య తీసుకుని భీమవరం బయల్దేరాడు.. అయితే, భీమవరం రైల్వే స్టేషన్‌లో దిగిన వెంటనే కొత్త నాటకం మొదలుపెట్టింది.. తాను పెళ్లి చేసుకున్న విషయం ఇంట్లో తెలియదని.. ఈ విషయం తెలిస్తే ఇంట్లోకి రానివ్వరని.. నా తల్లిదండ్రులను చూసి వెంటనే తిరిగి వచ్చేస్తానంటూ హడావుడిగా ఆటో ఎక్కి వెళ్లిపోయింది.. దీంతో.. రైల్వేస్టేషన్ నుంచి వెనుదిరి ఇంటికి చేరుకున్నాడు వేమారెడ్డి.. కానీ, రోజులు గడుస్తున్న తన భార్య తిరిగి రాలేదు.. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్.. కాస్త అనుమానంతో పెళ్లి చేసిన బ్రోకర్లకు ఫోన్ చేశాడు.. వాళ్ల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్.. చివరకు భీమవరం వెళ్లి ఆరా తీశాడు వేమారెడ్డి.. అదంతా డ్రామా అని.. అసలు అది పెళ్లేకాదని తెలుసుకుని షాక్ తిన్నాడు.. బ్రోకర్లు, పెళ్లికూతురు చేతిలో మోసపోయానని గ్రహించి హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.. అంటే.. పెళ్లి జరగడంలేదని తొందరపడి ఎక్కడో అక్కడే కమిట్ అయితే.. ఇలాంటి ఇబ్బందులు తప్పవన్నమాట.. పెళ్లికాని ప్రసాదాలు జాగ్రత్తమరి..