NTV Telugu Site icon

Shocking: భర్త ఉరేసుకుంటే వీడియో తీసిన భార్య..

Shocking

Shocking

Shocking: భర్తకు జీవితంలో అండగా నిలవాల్సిన భార్య, అతను చనిపోతుంటే అడ్డుకోకపోగా దానిని వీడియో తీసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. 29 ఏళ్ల మహిళ భర్త ఆత్మహత్యను ప్రేరేపించిందని, అతడి ఆత్మహత్యను ఆపకుండా వీడియో రికార్డ్ చేసిందనే ఆరోపణలపై ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: INDIA alliance: మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి కారణం ఇదే.. కర్ణాటక హోం మంత్రి కీలక వ్యాఖ్యలు..

థానేలోని వాగ్లే ఎస్టేట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న దంపతులు తరుచూ గొడవపడుతుండే వారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నవంబర్ 20 రాత్రి, 29 ఏళ్ల వ్యక్తి ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అతడి భార్య, భర్త ఆత్మహత్యను చూస్తూనే ఉంది కానీ ఆపేందుకు ప్రయత్నించలేదని, అతడి సూసైడ్‌ని తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసిందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం అతడి భార్యపై కేసు పెట్టారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 105, 108 కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

Show comments