Telugu Anchor Harassed By Her Friend Samrat In Hyderabad: ఈరోజుల్లో మహిళలు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఎన్ని చట్టాలు తెచ్చినా, కఠినమైన చర్యలు తీసుకుంటోన్నా.. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. స్నేహం ముసుగులోనూ కొందరు నీచపు పనులకు పాల్పడుతున్నారు. నమ్మినవారినే కాటేస్తున్నారు. తాజాగా ఓ కామాంధుడు కూడా స్నేహం ముసుగులో ఓ యాంకర్‌పై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. తప్పించుకొని పారిపోయినా వదల్లేదు. నగ్న చిత్రాలు లీక్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
PM Narendra Modi: గుజరాత్ ప్రజలు బీజేపీవైపే.. హిమాచల్‌లో ఒక్క శాతం ఓట్లతోనే..
హైదరాబాద్‌లోని మధురానగర్‌లో ఓ యువతి (27) హాస్టల్‌లో ఉంటోంది. ఈమె యాంకర్‌గా పని చేస్తోంది. ఈమెకు కళాశాలలో చదివే రోజుల్లోనే కే. సామ్రాట్ (30) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కాలేజీ రోజుల్లోనే అతడు ఆమెను ప్రపోజ్ చేశాడు. ప్రేమిస్తున్నానని, నిన్నే పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. అయితే.. ఆ యాంకర్ మాత్రం అతని ప్రేమని నిరాకరించింది. అతడ్ని దూరం పెట్టింది. ఆమెని విడిచి ఉండలేకపోయిన సామ్రాట్.. స్నేహం పేరుతో మళ్లీ దగ్గరయ్యాడు. ప్రేమ, దోమా వంటివి పక్కన పెట్టేసి.. ఇకపై స్నేహితులుగా ఉందామని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన యాంకర్.. అందుకు అంగీకరించింది. అయితే.. ఆ సమయంలో స్నేహం ముసుగు వెనుక దాగి ఉన్న అతని రాక్షస స్వరూపాన్ని ఆమె గుర్తించలేకపోయింది.
Election Results 2022: గుజరాత్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయం.. హిమాచల్‌లో కాంగ్రెస్‌దే పీఠం
ఈ క్రమంలోనే ఓసారి రైడ్‌కి వెళ్దామని చెప్పి.. సామ్రాట్ ఆ యాంకర్‌ని కారులో ఎక్కించుకున్నాడు. ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అయితే.. ఆ యాంకర్ అతని నుంచి తప్పించుకొని వచ్చేసింది. అప్పట్నుంచి సామ్రాట్ ఆ యాంకర్‌పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెని అనుభవించాలనుకొని.. మరింత దిగజారాడు. ఆమె ఫోటోలను నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేశాడు. ఆ ఫోటోల్ని ఆమెకు పంపించి.. తన కోరిక తీర్చకుంటే, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో.. ఆ యువతి బుధవారం పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
