ప్రముఖ కన్నడ సీరియల్ నటి ఆమె భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ అతడి నిజస్వరూపాన్ని బయటపెట్టింది.ప్రస్తుతం అతను ఒక కన్నడ సీరియల్ లో హీరోగా చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి తనపై ఆరుసార్లు అత్యాచారం చేశాడని, ఆ తరువాత బలవంతంగా తాళికట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కొన్నేళ్ల క్రితం తామిద్దరం సోషల్ మీడియా ద్వారా కలుకున్నామని, ఇద్దరం అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో తనకు మంచి అవకాశం ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడని, ఆ తరువాత తనపై అత్యాచారం చేసి కోరిక తీర్చుకున్నాడని తెలిపింది. ఆ తరువాత పెళ్లి గురించి మాట్లాడితే ఏవేవో సాకులు చెప్పి తప్పించుకున్నాడని, ఎంతో ఒత్తిడి చేసి స్నేహితులతో ఒప్పించడంతో గుడిలో పెళ్లి చేసుకున్నామని తెలిపింది.
అత్తారింటికి తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకున్నట్లు వారిని నమ్మించి చిత్ర హింసలు పెట్టడం మొదలుపెట్టాడని తెలిపిన ఆమె కట్నం తేవాలని ఒత్తిడి చేస్తూ కులం పేరుతో దూషిస్తున్నాడని వాపోయింది. తాను తీవ్ర అనారోగ్యం పాలై ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే భర్త, అత్తమామలపై విసిగి వేసారి.. పెళ్లికి ముందే తనపై భర్త అత్యాచారానికి పాల్పడ్డాడని బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఘ్తనపి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
