Site icon NTV Telugu

Priyanka Suicide Tragedy: పెళ్లికి ప్రియుడు ససేమిరా.. ప్రాణాలు తీసుకున్న ప్రియురాలు

Raghunath Goud Constable

Raghunath Goud Constable

Priyanka Suicide Tragedy: ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఎన్నో ఊసులు చెప్పాడు.. ఎంతో ఆశ కల్పించాడు.. చివరికి ముఖం చాటేశాడు. చేసుకున్న బాసలు.. చెప్పుకున్న ఊసులు.. అన్నీ ఒక్కసారిగా కల్లలైపోయే సరికి ఆ యువతి తట్టుకోలేకపోయింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ అతడు ససేమిరా అనడంతో చేసేదేం లేక తీవ్ర మనస్తాపంతో ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన గద్వాల జిల్లాలో జరిగింది. ఆ యువతి పేరు ప్రియాంక. ఆమె స్వస్థలం కొత్తగూడెం జిల్లా పాల్వంచ. ఆమె.. హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్న సమయంలో రఘనాథ్ గౌడ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. అతడి స్వస్థలం గద్వాల జల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి. హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటున్న సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో తాను ప్రేమిస్తున్నానని ప్రియాంకకు ఎన్నో కబుర్లు చెప్పాడు రఘునాథ్ గౌడ్. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమెతో హైదరాబాద్‌లో సన్నిహితంగా గడిపాడు.

READ ALSO: Road Accident: పట్టపగలే పీకలదాకా తాగి.. ఆగి ఉన్న వాహనాలను కారుతో ఢీకొట్టిన యువకుడు!

ఇక్కడి వరకు బాగానే ఉంది. కొన్నాళ్లకు రఘునాథ్‌కు కానిస్టేబుల్‌ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత సీన్ మారిపోయింది. ప్రియాంకను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. కులాలు వేరు కాబట్టి పెళ్లి చేసుకునేందుకు పెద్దలు ఒప్పుకోవడం లేదని కరాఖండిగా తేల్చి చెప్పాడు. ఒక్కసారిగా రఘునాథ్ గౌడ్ చెప్పిన మాటలు విని హతాషురాలైన ప్రియాంక.. ఏం చేయాలో అర్ధంకాక జులై 17న నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో అప్పట్లోనే పోలీసులు రఘునాథ్ గౌడ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు…

అప్పట్లో కోలుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ప్రియాంక.. నేరుగా రఘునాథ్ గౌడ్ ఇంటికి వెళ్లింది. అక్కడే ఉంటూ తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసింది. ఐతే ప్రియాంక రావడంతో రఘునాథ్ గౌడ్ తల్లిదండ్రులు తమ నివాసాన్ని మల్దకల్‌కు మార్చారు. ఈ క్రమంలో మరోసారి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది ప్రియాంక. విషయం తెలుసుకున్న డీఎస్పీ మొగులయ్య, సీఐ శ్రీను ఆమెను 108లో ఆస్పత్రికి తరలించారు. అదే రోజు సాయంత్రం వరకు చికిత్స పొందింది. ఆ తర్వాత ఆరోగ్యం కాస్త కుదుట పడడడంతో వైద్యులు డిశ్చార్జి చేశారు…

కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలుపుకొని తాగింది
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే.. రఘునాథ్ గౌడ్ తల్లిదండ్రులు ఉంటున్నమల్దకల్‌కు వెళ్లింది ప్రియాంక. అక్కడ వారితో వాగ్వాదానికి దిగింది. కానీ వారు చిన్నోనిపల్లికి వెళ్లాలని సూచించారు. చిన్నోనిపల్లికి వెళ్లిన ప్రియాంక.. అక్కడ కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలుపుకొని తాగింది. సమాచారం అందడంతో డీఎస్పీ ఆమెను 108లో గద్వాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది… ఆమె మృతికి రఘునాథ్‌ గౌడ్‌, అతడి కుటుంబసభ్యులు 22 మంది కారణం అని మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఆవరణలో ఆందోళన నిర్వహించారు… ప్రియాంక మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే రఘునాథ్‌గౌడ్‌ను సస్పెండ్‌ చేశామని… ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు…

READ ALSO: Hyderabad Child Torture: నువ్వేం తల్లివి.. ప్రియుడితో కలిసి 4 ఏళ్ల కూతురుకి టార్చర్..

Exit mobile version