దేశంలో టమోటా ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. టమోటాల వాడకాన్ని చాలా వరకు తగ్గించారు..ఇక కొందరు గృహిణులు ఆచితూచి టమాటాలను వినియోగిస్తున్నారు. కేవలం నెల రోజుల్లోనే కేజీ టమాట ధర రూ.20 నుంచి రూ.160కి చేరింది.. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా రూ.200 మార్కునుకూడా దాటేసింది. దీంతో టమాటాలు కూడా విలువైన వస్తువుల జాబితాలో చేరిపోయాయి. ఒకప్పుడు పెళ్లిళ్లు, ఫంక్షన్లకు విలువైన వస్తువులను బహుమతులుగా ఇచ్చేవారు. ఇప్పుడు టమాటాలను బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అంటే రేట్లు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు..
రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో ధరలు భారీగా పెరుగుతున్నాయి.. దాంతో వరుసగా టమోటా చో్రీలు కూడా జరుగుతున్నాయి.. ఇటీవల ఇలాంటి ఎక్కువ అవుతున్నాయి.. ఆఖరికి దొంగలు కూడా ఇంట్లో చోరికి వచ్చి టమోటాలను తీసుకెళ్తున్నారు.. తాజాగా తెలంగాణాలో ఒక విచిత్ర దొంగతనం జరిగింది..ఇంట్లో నగదు, బంగారం ఎత్తుకు పోవడానికి వచ్చిన దొంగలు.. ఫ్రిడ్జ్ లోని కిలో టమోటాలను కూడా ఎత్తుకుపోవడం చూసి ఇంటి వాళ్ళు అవాక్కయ్యారు. ఈ విచిత్ర ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో వెలుగు చూసింది. పట్నంలోని ఓ ఇంట్లోని వారు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం రాత్రి వారి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లోని నగదు, ఆభరణాలను దోచుకున్నారు. ఆ తర్వాత ఫ్రిజ్లో ఉన్న కిలో టమాటాలను కూడా వదలకుండా తీసుకెళ్లినట్టున్నారు…
మున్సిపల్ ఉద్యోగి రఫీ కుటుంబం బోధనలోని గౌడ్స్ కాలనీలో నివాసం ఉంటుంది. సోమవారం సాయంత్రం వీరంతా ఇంటికి తాళం వేసి సిద్దిపేటలోని బంధువుల ఇంటికి. వెళ్లారు. తర్వాత రోజు మళ్లీ ఇంటికి వచ్చారు.. ఇంట్లో వస్తువులు చిందర వందరగా ఉండటంతో ఇంట్లో దొంగతనం జరిగిందని గమనించారు..బీరువాలో దాచి ఉంచిన నగదు రూ.1.28లక్షలు, 12 తులాల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయని గమనించారు..ఆ తర్వాత ఇల్లు గమనిస్తుండగా ఫ్రిడ్జ్ తలుపు తెరిచి ఉంది. అందులో చూడగా కిలో టమాటాలు కూడా కనిపించలేదు. దీంతో వాటిని కూడా దొంగలే ఎత్తుకెళ్లారని గుర్తించారు. మంగళవారం బాధితులు రఫీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..