Site icon NTV Telugu

Telangana : దారుణం.. చికెన్ వండలేదని భార్యను గొడ్డలితో నరికిన భర్త..

hyderabad

hyderabad

భార్యా భర్తల మధ్య గొడవలు సహజం.. అయితే చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పడటం సహజం.. కొన్ని గొడవలు చావు వరకు వెళ్తున్నాయి.. మరికొన్ని ఘటనలు కుటుంబాలను విడగొడుతున్నాయి.. చిన్నచిన్న కారణాలకే హత్యల దాకా వెళుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయని పోలీసులు అంటున్నారు. మాటలతో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నారని, కోపతాపాలను కాస్త అదుపులో పెట్టుకోవాలని. భార్యాభర్తల మధ్య గొడవలు మామూలే కానీ.. ఇలా నరక్కోవడం వరకు రాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.. తాజాగా కూర వండలేదని భార్యను అతి దారుణంగా భర్త చంపాడు.. ఈ దారుణ ఘటన తెలంగాణలో వెలుగు చూసింది..

వివరాల్లోకి వెళితే.. తెలంగాణాలోని మంచిర్యాల లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.. రాత్రికి చికెన్ కూర వండాలని చెబితే.. వంకాయ కూర వండిందని కోపానికి వచ్చిన ఆ భర్త. గొడ్డలితో భార్య మీద దాడి చేసి హత్య చేశాడు. నిద్రిస్తున్న సమయంలో దాడి చేయడంతో గాలిపెల్లి శంకరమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను చంపిన భర్త గాలిపెల్లి పోశం అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం వెలుగు చూడడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు..

కాగా, మార్చిలో ఇలాంటి ఘటనే ఏపీలోని ఒంగోలు లో వెలుగు చూసింది. క్షణికావేశం నిండు కుటుంబాన్ని ఒక్క రాత్రి లో తలకిందులాగా చేసింది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన కలహాలు.. తద్వారా క్షణికావేశం ఇద్దరు చిన్నారులను అనాధలుగా మార్చేసింది. డాకా అంజిరెడ్డి,పూర్ణిమ దంపతులు. చిన్న గొడవ జరగడం తో భార్యను కోట్టి చంపాడు.. భార్య చనిపోయిందని తెలియగానే అతను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. పిల్లలు అనాధలుగా మారారు..క్షణికావేశంలో తొందర పడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు..

Exit mobile version