Theft: ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి ఇంటి యజమానికి నిద్రమాత్రలు ఇచ్చి ఇంటిని దోచేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోలో చోటు చేసుకుంది. నిందితుడిని లక్నో పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. దొంగతనం చేసేందుకు వృద్ధురాలైన యజమానికి సాధారణ మందుల స్థానంలో నిద్ర మాత్ర అయిన డయాజెఫామ్‌ని అందించాడు. ఆ తర్వాత నిందితుడు తన తండ్రి, దూరపు బంధువు సాయంతో ఇంట్లోని రూ. 15.5 లక్షలకు పైగా నగలు, రూ. 1 లక్ష నగదు దోచుకున్నాడు. ఇదంతా కొన్ని నెలలుగా నిందితుడు, మహిళ నిద్రలోకి జారుకున్న తర్వాత చిన్న మొత్తాలుగా విలువైన వస్తువులను కాజేస్తూ వస్తున్నాడు.
Read Also: Jharkhand : ఎన్నికల ముందు జార్ఖండ్‌లో బాంబు పేలుడు.. ముగ్గురు పిల్లలతో సహా నలుగురు మృతి
నిందితుడిని మహ్మద్ సుహైల్(19)గా గుర్తించారు. ఇతను రెండేళ్ల క్రితం ఇంట్లో పనికి కుదిరాడు. అతని తండ్రి మహ్మద్ షరీఫ్(40), అతని బంధువు షకీల్(30)ల నుంచి రూ. 15.5 లక్షల విలువైన నగలు, రూ. 50,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని సాదత్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఏరియా పరిధిలో నివసిస్తున్న అత్తర్ వ్యాపారి, వృద్ధురాలి కుమారుడు సైఫ్ సమాది ఈ దొంగతనాన్ని పసిగట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వృద్ధురాలికి మందులు, ఆరోగ్య సంరక్షణ కోసం నియమించిన సుహైల్ ఆమెకు డయాజెపామ్ ఇప్పించి, నిద్రపోయిన తర్వాత పట్టుబడకుండా ఉండేందుకు చిన్న మొత్తాల్లో నగలు, నగదును అపహరించేవాడు. ఆ తర్వాత అతను ఆభరణాలను, నగదును అపహరించేవాడు. వీటిని తన క్రైమ్ పార్ట్‌నర్‌గా ఉన్న మహ్మద్ షరీఫ్, షకీల్‌కి ఇచ్చేవాడు.