NTV Telugu Site icon

Marriage Fraud: నిత్య పెళ్లికొడుకు అరెస్ట్.. పెళ్లి పేరుతోనూ పలువురిని మోసం

Marriage Fraud

Marriage Fraud

Techie Arrested For Cheating Woman In The Name Of Marriage: అతడు ఒక ఐటీ ఉద్యోగి. ఎంతో పద్ధతిగా, సంస్కారవంతంగా ఉంటాడు. నలుగురితోనూ స్నేహంగా మెలుగుతాడు. అయితే.. ఇది కాయిన్‌కి ఒకవైపు మాత్రమే. కాయిన్‌కి మరోవైపు మాత్రం రాక్షస రూపం ఉంది. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు.. పెళ్లి పేరుతో కొంతమందిని మోసం చేశాడు కూడా! తమ పరువు పోతుందన్న భయంతో మోసపోయిన వాళ్లు మౌనం పాటించడంతో.. అతడు మరింత రెచ్చిపోయాడు. కానీ.. ఓ మహిళ ఎదురు తిరగడంతో అతని బాగోతం బట్టబయలైంది. అతడు జైలుపాలు అవ్వాల్సి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

LoanApp Harassment: లోన్‌యాప్ వేధింపులకు మరో వ్యక్తి బలి.. భార్యకి మార్ఫింగ్ ఫోటోలు పెట్టి..

ఆ నిత్య కొడుకు పెళ్లి వంశీ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయిన్‌పల్లికి చెందిన ఇతగాడు.. హైటెక్ సిటీ మాధాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. నెల్లూరుకు చెందిన ఓ వివాహితతో ఇతను సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెను తన ముగ్గులోకి దింపాడు. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా.. మాట దాటవేస్తూ వచ్చాడు. చివరికి పెళ్లికి నిరాకరించడంతో.. ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది. అప్పుడు అతని అసలు బాగోతం బట్టబయలైంది. వంశీకి అప్పటికే ఇద్దరు మహిళలతో వివాహం అయ్యిందని, వారికి విడాకులు కూడా ఇచ్చాడని తేలింది. అంతేకాదు.. ప్రేమ, పెళ్లి పేరుతో పలువురు మహిళల్ని మోసం చేసినట్లు కూడా వెల్లడైంది. పోలీసుల్ని అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Jr NTR: తారకరత్న పోరాడుతున్నారు.. మీడియాతో జూ. ఎన్టీఆర్

కాగా.. తన భర్త మరణించడంతో బాధిత మహిళ ఒంటరిగా ఉంటోంది. జీవితాన్ని తిరిగి కొత్తగా ప్రారంభించాలనుకున్న ఆమె.. మ్యాట్రిమోనిలో తన వివరాలను పొందుపరిచింది. ఈ క్రమంలోనే వంశీతో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో.. అతనితో సహజీవనానికి అంగీకరిచానని తెలిపింది. కానీ.. అతడు ఇలా మోసం చేస్తాడని తాను అనుకోలేదని ఆమె బోరున విలపించింది. బాధితురాలు డెర్మటాలజిస్ట్‌గా విధులు నిర్వహిస్తుంది.