గురువు అంటే.. విద్యను నేర్పించేవాడు మాత్రమే కాదు.. ఒక తరాన్ని ఎలా నడిపించాలో నేర్పించేవాడు.. విలువలను నేర్పి సమాజాన్ని అభివృద్ధి చేసేవాడు.. అన్నింటికీ మించి ఆచరించి చెప్పే వాడే ఆచార్యుడు.. కానీ ఇప్పుడున్న గురువులు ఇలా ఉంటున్నారా..? అంటే నిస్సందేహంగా నో అనే చెప్తారు ఎవరైనా.. ప్రస్తుతం సమాజంలో జరిగే కొన్ని ఘటనలు చూస్తుంటే వారిని గురువులు అనాలా..? కామ పిశాచులు అనాలో అర్ధం కావడం లేదు.. కామంతో కళ్ళు మూసుకుపోయిన గురువులు.. చదువుకోవడానికి వచ్చిన విద్యార్థినిలపై కన్నేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు.. మరికొందరు సిగ్గు విడిచి స్కూల్స్ లోనే రాసలీలలు నడుపుతూ గురువు అన్న పదానికే మాయని మచ్చగా మారుతున్నారు. తాజాగా ఒక వైస్ ప్రిన్సిపాల్.. మరో లేడీ టీచర్ స్కూల్ లోనే కామ క్రీడలు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు.. ఆ వీడియో వైరల్ కావడంతో అవమాన భారంతో లేడీ టీచర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తోన్న ఒక వ్యక్తి.. అదే స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోన్న మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. విద్యార్థులకు చదువు చెప్పడం మానేసి తరగతి గదిలో ఇద్దరు కామ క్రీడల్లో మునిగి తేలారు.. ఇక ఈ క్రమంలోనే వారు అలా ఉండడాన్ని చుసిన మరో ఉపాద్యాయుడు వారిద్దరిని వీడియో తీసి నిలదీశాడు. దీంతో వారిద్దరు అందరిముందు తలదించుకున్నారు. ఆ వీడియో వైరల్ కావడంతో సదురు లేడీ టీచర్.. అవమాన భారం తట్టుకోలేక , ఇంట్లో వాళ్ళకి మొహం చూపించలేక.. గదిలో ఆత్మహత్య చేసుకోగా వైస్ ప్రిన్సిపాల్ పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
