NTV Telugu Site icon

Vikarabad Teacher: కీచక టీచర్.. విద్యార్థినితో అసభ్య ప్రవర్తన

Teacher Indecent Behavior

Teacher Indecent Behavior

Teacher Arrested For Indecent Behaviour With Minor Girl Student In Vikarabad: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు. మైనర్ అయిన ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తాను తండ్రిగా భావించే టీచర్.. తన పట్ల అలా అసభ్యంగా ప్రవర్తించేసరికి ఆ విద్యార్థిని ఒక్కసారిగా ఖంగుతింది. అతడు చేసిన పనికి ఆ అమ్మాయి స్కూలుకి వెళ్లడమే మానేసింది. చివరికి తన తల్లికి జరిగిన విషయం చెప్పడంతో.. పోలీసులు రంగంలోకి దిగి, ఈ టీచర్‌కి తగిన బుద్ధి చెప్పారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Koppula Eshwar: అడ్లూరిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం.. మంత్రి హెచ్చరిక

వికారాబాద్‌‌లోని మోమిన్‌పేటలో ఉర్దూ మాధ్యమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా టీ.ప్రభు విధులు నిర్వహిస్తున్నారు. ఓ విద్యార్థినిపై కన్నేసిన అతగాడు.. మొదట్లో ఆమెకు దగ్గరయ్యేందుకు మంచివాడిలాగా నటించాడు. ఆ తర్వాత నుంచి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. రానురాను ఈ టీచర్ వికృత చేష్టలు హద్దు మీరడంతో.. ఆ విద్యార్థిని భయపడి, స్కూలుకి వెళ్లడం మానేసింది. ఏదో ఒక అబద్ధం చెప్తూ.. రెండు రోజులు ఇంట్లోనే ఉండిపోయింది. కూతురు ప్రవర్తనలో మార్పు రావడం, ఎప్పుడూ లేనంతగా భయంభయంగా ఉండటంతో.. తల్లికి అనుమానం వచ్చింది. దీంతో.. ఏం జరిగింది? ఎందుకిలా ఉన్నావ్? అని తన కూతుర్ని నిలదీసింది.

Adipurush : ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతాషిర్ పూర్వీకుల ఇంటికి పోలీసులు కాపలా

అప్పుడు ఆ బాలిక అసలు విషయం బయటపెట్టింది. ప్రధానోపాధ్యాయుడైన టీ ప్రభు తనపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, ఆ భయంతోనే స్కూలుకి వెళ్లడం లేదని తెలిపింది. దీంతో.. కుటుంబసభ్యులు వెంటనే పాఠశాలకు వెళ్లి, అతడ్ని నిలదీశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి, అతడ్ని అదుపులోకి తీసుకొని, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డీఈఓ కార్యాలయంలోని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అబ్దుల్‌ ఘనీ, ఈ కేసు విచారణను చేపట్టారు.