TCS Nashik Case: “నీ భార్యను నా దగ్గరికి పంపు”.. టీసీఎస్ నాసిక్ కేసులో సంచలన విషయాలు..

  • టీసీఎస్ నాసిక్ కేసులో సంచలన విషయాలు..
  • పిల్లల కోసం నీ భార్యను పంపు అంటూ వేధింపులు..
  • సంచలన ఆరోపణలు చేసిన ఉద్యోగి..
  • మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో బయటపడిన కేసు..
  • పలువురు అరెస్టులు, కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది..
Tcs Case

Tcs Case

TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లీమ్ లీడర్లుగా ఉన్న ముస్లిం ఉద్యోగులు, హిందూ మహిళలు, ఉద్యోగులపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, బాధితులు తమ వేధింపులను మీడియాతో పంచుకుంటున్నారు. బాధితుల్లో ఒకరైన ఉద్యోగి మాట్లాడుతూ.. దోపీ ధరించి నమాజ్ చేయాలని బలవంతంగా చేసినట్లు ఆరోపించారు. ఇదే కాకుండా, బిడ్డ కావాలంటే నీ భార్యని పంపమని నిందితుల్లో ఒకరు చెప్పినట్టు ఆరోపించారు.

నమాజ్ చేయించడమే కాకుండా, కల్మా పఠించాలని ఒత్తిడి చేశారని చెప్పారు. సంతానం కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసి, తన భార్యను పంపాలని నిందితుల్లో ఒకరు ఎగతాళి చేసినట్లు బాధితుడు ఆరోపించారు. 2022లో కంపెనీలో చేరిన వెంటనే వేధింపులు మొదలయ్యాయని చెప్పారు. తన టీమ్ లీడర్ తౌసిఫ్ అక్తర్, సహోద్యోగి డానిష్ షేక్‌తో కలిసి తనను టార్గెట్ చేసుకున్నట్లు వెల్లడించారు. తన కన్నా పై స్థాయిలో ఉండటంతో నిందితులు వారి సూచనల్ని పాటించేలా ఒత్తిడి చేశారని, ఎక్కువగా పని ఇచ్చే వారని ఆరోపించారు.

Read Also: No Rain-No Gain: వానలు పడితే స్టాక్ మార్కెట్ పరుగులు.. వర్షానికి, స్టాక్ మార్కెట్‌కు సంబంధం ఏంటి..?

23 ఏళ్ల మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చారు. మొత్తం 9 మంది ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. బాధితుల్లో మహిళలతో పాటు ఒక పురుషుడు కూడా ఉన్నాడు. డానిష్, తౌసిఫ్, హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ హిందూ దేవుళ్ల గురించి అభ్యంతరక వ్యాఖ్యలు చేశారని, మత విశ్వాసాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని, డానిష్ తనను బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని, పెళ్లి చేసుకోవాలని కోరాడని బాధితులురాలు తన ఎఫ్ఐఆర్‌లో ఆరోపించింది. ఈ ఆరోపణలపై మహిళా కానిస్టేబుళ్లు కంపెనీలో అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించి, నిందితుల సాక్ష్యాధారాలు సంపాదించారు.

రుద్రాక్ష మాలను తీసేయాలని ఒత్తిడి చేసినట్లు, తన మతాన్ని అవమానించినట్లు బాధిత ఉద్యోగి చెప్పాడు. తాను శాఖాహారి అయినప్పటికీ, నైట్ షిఫ్ట్‌ తర్వాత హోటళ్లకు తీసుకెళ్లి మాంసాహారం తినాలని ఒత్తిడి చేసే వారని ఆరోపించారు. 2023 ఈద్ రోజున తౌసిఫ్ తన ఇంటికి పిలిచి మతపరమైన టోపీ ధరింపచేసి, నమాజ్ చేయాలని బలవంతం చేశారని, ఆ తర్వాత దీనిని ఫోటోలు తీసి కంపెనీ గ్రూప్‌లో షేర్ చేసినట్లు ఆరోపించారు.