Task Force Police Bust Prostitution House In Hyderabad Punjagutta: మన దేశంలో వ్యభిచారం చట్టరీత్యా నేరం. అయినా సరే.. కొందరు దుండగులు ఈ వ్యాపారాన్ని గుట్టుగా సాగిస్తున్నారు. యువతుల్ని బలవంతంగా ఈ రొంపిలోకి దింపి.. క్యాష్ చేసుకుంటున్నారు. స్పా మాటున వ్యభిచార గృహాలను నడుపుతున్నారు. పైన పటారం లోన లొటారం అన్నట్టు.. బయట స్పా బోర్డులు పెట్టి, లోపల మాత్రం ఈ పాడుపని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఎన్నో వ్యభిచార గృహాలపై ఉక్కుపాదం మోపినా.. కొందరు ఇంకా ఈ దందాని నడిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా పంజాగుట్టలోనూ ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి.. ఏకంగా 20 మంది యువతుల్ని కాపాడారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Mission Teaser: అసలు ఏ ‘మిషన్’ కోసం జైలుకు వెళ్ళావ్ భయ్యా..
పంజాగుట్టలో ఒక స్పా ఉంది. అయితే.. అది పేరుకి మాత్రమే స్పా, లోపల మాత్రం వ్యభిచార వ్యాపారం సాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అక్షయ్ అలియాస్ వినయ్, ఆర్. శృతి ఈ వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. కొంతకాలం నుంచి ఎవ్వరికీ అనుమానం రాకుండా వీరు ఈ పాడుపనిని కొనసాగిస్తున్నారు. అయితే.. ఈ విషయం గురించి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలిసింది. దీంతో.. సోమవారం రాత్రి పంజాగుట్ట పోలీసుల సహకారంతో ఆ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నిజంగానే ప్రాస్టిట్యూషన్ దందా నడుస్తుండటం చూసి.. ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దీంతో.. వినయ్, శృతితో పాటు అందులో ఉద్యోగం చేసే మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన 20 మంది యువతుల్ని కాపాడిన పోలీసులు.. విటుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Rajasthan Royals vs Punjab Kings: టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న రాజస్థాన్
