Site icon NTV Telugu

Chennai: 15 ఏళ్లుగా చోరీలు చేస్తున్న సర్పంచ్… ఎందుకంటే…

Sam (3)

Sam (3)

కొందరు ఏలాంటి పని దొరక్కొ. . దొంగతనం వృత్తిగా భావించి చోరీలకు పాల్పడుతారు. కానీ ఇక్కడ ఓ విచిత్ర సంఘటన జరిగింది. చోరీలు చేస్తే వచ్చే ఆనందం కోసమే..15 ఏళ్లుగా చోరీలు చేస్తున్నానని తెలిపింది ఓ మహిళ..

పూర్తి వివరాల్లోకి వెళితే… తమిళనాడుకు చెందిన ఓ గ్రామ పంచాయతీ సర్పంచి. 15 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నది. చివరకు ఆమె పోలీసులకు దొరికి పోయారు. చెన్నై నెర్కుండ్రానికి చెందిన వరలక్ష్మి అనే మహిళ బస్సులో ప్రయాణిస్తుండగా ఆమె మెడలోని 5 సవర్ల బంగారు గొలుసు చోరీకి గురైంది. బాధితురాలు కోయంబేడు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు తిరుప్పత్తూరు జిల్లా నరియంపట్టు పంచాయతీ సర్పంచి భారతి(డీఎంకే)ని ఆదివారం అరెస్టు చేశారు.

అనంతరం ఆమెను విచారించిన పోలీసులు.. విస్తుపోయే నిజాలు తెలుసుకున్నారు. డబ్బు, పలుకుబడి ఉన్నా, చోరీ చేసినప్పుడు వచ్చే ఆనందమే వేరని, అందుకే 15ఏళ్లుగా దొంగతనాలు చేస్తున్నానని చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

Exit mobile version