Site icon NTV Telugu

Tragedy : ఓ ప్రేమకథ.. గాజుపెంకుతో ముగిసింది..!

Dead

Dead

Tragedy : హైదరాబాద్‌ శివారులోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. న్యూగ్రీన్ సిటీ ప్రాంతంలో నివసించే నజియా బేగం (30)ను ఆమె భర్త జాకీర్ అహ్మద్ (31) హత్య చేశాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గతంలో గోల్కొండ ప్రాంతంలో ఉండే ఈ దంపతులు, లోకల్ బ్రోకర్ సిరాజ్ ద్వారా ఈ ఇంటిని కిరాయికి తీసుకున్నారు. కొద్ది రోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

Aadi Srinivas : అభివృద్ధిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయి.. అందుకే..

అయితే.. భార్య నజియా మీద అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో భర్త జాకీర్, నిన్న రాత్రి ఘోరంగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కట్టెలతో కొట్టి, గాజు పెంకులతో గాయపరిచి, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నజియాను హత్య చేసిన అనంతరం జాకీర్ పరారయ్యాడు. ఉదయం ఈ దారుణ ఘటనను గమనించిన అత్త రుబీనా పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నజియా ఈవెంట్ నిర్వహణలో పనిచేస్తుండగా, కుటుంబంలోని చిన్నారుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

Bhatti Vikramarka : భారీ అప్పుల్లోనూ సంక్షేమానికి తడబాటులేదు

Exit mobile version