NTV Telugu Site icon

BJP Leader Suicide: బీజేపీ మహిళా నేత ఆత్మహత్య..

Bjp Leader Suicide

Bjp Leader Suicide

BJP Leader Suicide: గుజరాత్‌లోని సూరత్ నగరానికి చెందిన 34 ఏళ్ల బీజేపీ మహిళా నాయకురాలు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. సూరత్‌లోని వార్డ్ మెంబర్ 30లో దీపికా పటేల్ అనే బీజేపీ మహిళా మోర్చా నాయకులురా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆమె భర్త రైతు, ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు.

Read Also: Damodara Raja Narasmiha : పేదవాని వైద్యం, విద్య మా బాధ్యతగా భావించేది… కాంగ్రెస్ పార్టీ..

దీపికా పటేల్ నిన్న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. కార్పొరేటర్ చిరాగ్ సోలంకి, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని సీనియర్ పోలీస్ అధికారి విజయ్ సింగ్ గుర్జార్ తెలిపారు. ఉరివేసుకుని చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. కాల్ రికార్డు, ఫోరెన్సిక్ పరీక్షల్ని పోలీసులు విశ్లేషిస్తున్నారు.

దీపిక చనిపోయే ముందు చిరాగ్ సోలంకికి చివరిసారిగా ఫోన్ చేసిందని పోలీసులు తెలిపారు. తాను ఒత్తడిలో ఉన్నానని, బతకలేనని దీపిక చిరాగ్‌తో చెప్పిందని వెల్లడించారు. చిరాగ్ ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లే సరికి, తలుపులు మూసేసి ఉన్నాయని, 13, 14, 16 ఏళ్ల పిల్లలు ఇంట్లో మరోగదిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. చిరాగ్ తలుపులు పగలగొట్టి చూసే సరికి దీపికా ఉరివేసుకుని కనిపిచింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంలో వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికి లాభం లేకుండా పోయింది. ఆమె ఎందుకు మరణించందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం చిరాగ్ సోలంకిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆమెను తన సోదరిగా భావించినట్లు సోలంకి చెప్పాడని పోలీసులు తెలిపారు.