NTV Telugu Site icon

Crime News: కూతురిపై తండ్రి అత్యాచారం.. దుర్మార్గుడా.. నిన్ను ఉరి తీసినా తప్పులేదురా..

Crime

Crime

Crime News: సమాజంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతోంది. బయటకు వెళితే.. ఆకలితో చూసే చూపులు ఎన్నో.. ఎవడు.. ఎటునుంచి వచ్చి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడతాడో తెలియదు. ఇంట్లో ఉంటే.. సొంత రక్త సంబంధమే.. కామంతో కళ్ళుమూసుకుపోయి కామాంధులుగా మారుతున్నారు. వీరికి వయస్సుతో సంబంధం లేదు.. వావి వరుసలు మరిచి 5 నిమిషాల సుఖం కోసం జంతువులుగా మారుతున్నారు. తాజాగా నాలుగేళ్ళ చిన్నారి అత్యాచారానికి గురైంది. అది తన సవతి తండ్రి చేతిలో.. ఛీఛీ ఇంతకన్నా నీచమైన విషయం ఇంకొకటి ఉండదు. కామంతో కళ్ళుమూసుకుపోయిన ఆ కామాంధుడు.. ముక్కుపచ్చలారని చిన్నారిపై అతి క్రూరంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలంగాణ నడిబొడ్డులో జరగడం విచారకరం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Man Hits Daughter In Law: ఉద్యోగం చేస్తానన్న పాపానికి.. ఇటుకతో కోడలిపై మామ దాడి

తెలంగాణ లోని మైలార్ దేవ్పల్లి పీఎస్ పరిధిలో ఈ దారుణం జరిగింది. రైల్వే బుద్వేల్లోని వెంకటేశ్వర కాలనీకి చెందిన వెంకటయ్య కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే అతనివద్దనే ఒక మహిళ, ఆమె నాలుగేళ్ళ కుమార్తె కూడా ఉంటున్నారు. వీరికి వివాహం అయ్యిందో లేదో అనేది తెలియదు. ఇక చిన్నారి అతడిని నాన్న అనే పిలుస్తుందని సమాచారం. ఇక తాజాగా అతడు శంషాబాద్ ఫ్లైఓవర్ వద్ద లేబర్ క్యాంప్ లో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అత్యంత పాశవికంగా.. పెంచిన బిడ్డ అని కానీ, నాలుగేళ్ల చిన్నారి కానీ ఆలోచించకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.అనంతరం చిన్నారి ఏడుస్తూ తల్లివద్దకు వెళ్లి.. పెపుడు తండ్రి ఇలా చేశాడు అని చెప్పడంతో ఈ ఘటన వెలుగుచూసింది. వెంటనే తల్లి.. చిన్నారిని తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారి ప్రస్తుతం నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటయ్యను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్నవాడు.. ఇలాంటి నీచుడును ఉరి తీసినా తప్పులేదు అంటూ చెప్పుకొస్తున్నారు.