NTV Telugu Site icon

Uttar Pradesh: బాలికపై అత్యాచారం.. ఎస్పీ నేత అరెస్ట్‌

Uttarpradesh

Uttarpradesh

యూపీలో మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఆ మధ్య అయోధ్యలో బాలికపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బాధితురాలి గర్భం దాల్చడంతో ఈ ఘోరం రెండు నెలల తర్వాత వెలుగులోకి రావడంతో యోగి సర్కార్ నిందితుల్ని అరెస్ట్ చేయించింది. నిందితుల సమాజ్‌వాదీ పార్టీ నేతలేనని సీఎం యోగి ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Strange Incident: హెర్నియా ఆపరేషన్కు వెళ్లిన వ్యక్తి శరీరంలో గర్భాశయం.. షాకైన డాక్టర్లు

తాజాగా మైనర్‌పై అత్యాచారం కేసులో ఎస్పీ నేత నవాబ్‌ సింగ్‌ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కన్నౌజ్‌ ఎస్పీ అమిత్‌ కుమార్‌ ఆనందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘నిన్న రాత్రి 1.30 సమయంలో ఓ బాలిక 112 నంబర్‌కు కాల్‌ చేసిందన్నారు. తనపై అత్యాచారం చేశారని, తన అత్తను లైంగికంగా వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. దీంతో ఓ పోలీసు ఆమె దగ్గరకు వెళ్లారన్నారు. అనంతరం ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. అక్కడ నవాబ్‌ సింగ్‌.. మరో మహిళ ఉన్నారని వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నవాబ్ సింగ్‌పై పోక్సో నమోదు చేసి అరెస్ట్‌ చేశామన్నారు. కాగా ఉద్యోగం పేరుతో ఆశ చూపించి నవాబ్ సింగ్‌ వారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసిందని పోలీసులు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను బాధితురాలు సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది.