Loan App: గోరంత ఇచ్చి కొండంత వసూలు.. ఆపై నగ్న ఫోటోలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్య లోన్ యాప్స్ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇచ్చేది గోరంతే అయినా, పెట్టే వేధింపులు మాత్రం కొండంత! ఈ లోన్ యాప్స్ వల్ల ఎందరో లేనిపోని ఇబ్బందుల్ని ఎదుర్కున్నారు. తాజాగా మరో లోన్ యాప్ అత్యంత దుర్మార్గానికి పాల్పడింది. తాను తీసుకున్న దానికంటే భారీ మొత్తం చెల్లించినా.. ఇంకా అప్పు తీరలేదంటూ ఓ మహిళను మానసికంగా వేధించడమే కాదు, ఆమె నగ్న ఫోటోను వైరల్ చేశారు. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
కావలిలోని కచ్చేరిమిట్టకు చెందిన పసుపులేటి మౌనికను మనస్పర్థల కారణంగా భర్త వదిలేశాడు. ఆమె తన ముగ్గురు కుమార్తెలతో నివసిస్తోంది. ఒక హోటల్‌లో దినసరి కూలీగా పని చేస్తోన్న మౌనిక.. ఆరు నెలల క్రితం ఆన్‌లైన్‌లో ‘స్పీడ్’ అనే యాప్‌లో రూ. 5,000 అప్పు కోసం దరఖాస్తు చేసుకుంది. అంత మొత్తం ఇవ్వలేమన్న ఆ యాప్ యాజమాన్యం.. రూ. 2,500 ఆమె ఖాతాలో జమ చేసింది. సమయానికి డబ్బు చెల్లించలేకపోవడంతో.. యాప్‌కు సంబంధించిన వ్యక్తి ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె నుంచి ఏకంగా రూ. 70 వేల వరకు నగదు కట్టించుకున్నాడు. అయినా ఇంకా బాకీ ఉందని వేధిస్తూ వస్తున్నాడు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
అయితే.. తనకు ఆర్థిక స్థోమత లేదని, ఇంకా తాను డబ్బులు కట్టలేనని మౌనిక చెప్పింది. దీంతో, ఆమె ఫోటోను నగ్న చిత్రంతో మార్ఫింగ్ చేసి, ‘స్పీడ్’ యాప్ ద్వారా ఆమె కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళందరికీ పంపాడు. ఈ విషయం తెలిసి తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు.. వెంటనే పోలీసుల్ని ఆశ్రయించింది. తీసుకున్న రెండున్నర వేలకు తాను రూ. 70 వేలు కట్టినా, ఆ దారుణానికి ఒడిగట్టారంటూ రోదించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!