Site icon NTV Telugu

Software Engineer Incident: నార్సింగిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి

Died 1

Died 1

చిన్న చిన్న కారణాలతో యువతీ, యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నార్సింగిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భార్గవ్ రెడ్డి అనుమానాస్పద మృతి కేసు నమోదైంది. పుప్పాల్ గూడ అల్కాపూరీ కాలనీ లోని ఓ అపార్ట్‌మెంట్ గది లో విగత జీవిలా కనిపించాడు భార్గవ్ రెడ్డి. వెంటనే నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు రూమ్ మెట్ సాయి సందీప్‌. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు. అప్పటికే భార్గవ్ రెడ్డి మృతి చెందినట్లు నిర్దారించారు పోలీసులు.

గత ఐదు రోజుల క్రితం భార్గవ్ రెడ్డి చనిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. గత కొంత కాలం నుండి సాయి సందీప్, జస్వంత్, భార్గవ్ రెడ్డి లు రూమ్ మెట్స్. ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. వీకెండ్ కావడంతో భార్గవ్ రెడ్డికి చెప్పి సొంత ఊరికి వెళ్లిపోయాడు జస్వంత్, సాయి సందీప్‌ లు. 10 రోజుల అనంతరం తిరిగి హైదరాబాద్ వచ్చిన సాయి సందీప్‌. తన గది తలుపులు తట్టాడు సందీప్‌. ఎంతకీ తలుపులు తెరవక పోవడంతో అనుమానం వచ్చి వాచ్ మెన్ సహాయం తో కిచెన్ కిటికీ పగలగొట్టి లోపలికి వెళ్ళాడు సందీప్‌.

బెడ్ రూమ్ లో ఉలుకు పలుకు లేకుండా కనిపించిన భార్గవ్ రెడ్డి. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యాడు స్నేహితుడు. 100 ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు సందీప్‌. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మృతుడు ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ కు చెందిన వ్యక్తి గా గుర్తించారు. భార్గవ్ మృతికి గల కారణాల పై ఆరా తీస్తున్నారు పోలీసులు.

Read Also: Monkeypox: మంకీపాక్స్ పేరు మార్పు.. ప్రజల సలహాలు కోరిన డబ్ల్యూహెచ్ఓ

Exit mobile version