Site icon NTV Telugu

Jammu Kashmir: ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు.. అసలేం జరిగింది?

Jammu Kashmir

Jammu Kashmir

Jammu Kashmir: జమ్మూలోని సిధ్రా ప్రాంతంలోని ఒకే ఇంట్లో ఆరుగురు విగత జీవులుగా కనిపించడం కలకలం రేపింది. ఓ ఇంటిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.”జమ్మూలోని సిధ్రా ప్రాంతంలోని వారి నివాసంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు శవమై కనిపించారు. వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నాం.” అని జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు.

Lightning strikes: పిడుగుపాటుకు నలుగురు బలి

పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు సకీనా బేగం, ఆమె ఇద్దరు కుమార్తెలు రుబీనా బనో, నసీమా అక్తర్, కుమారుడు జాఫర్ సలీం, మరో ఇద్దరు బంధువులు నూర్ ఉల్ హబీబ్, సాజిద్ అహ్మద్‌గా గుర్తించారు. ఈ అనుమానాస్పద మరణాలకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version