Site icon NTV Telugu

NIA Investigation: సిరాజ్‌, సమీర్‌ విచారణ.. బయటపడుతున్న కీలక విషయాలు

Nia

Nia

NIA Investigation: పేలుళ్లకు ప్లాన్‌ చేసి పట్టుబడ్డ ఉగ్రవాదులు సిరాజ్‌, సమీర్‌లు ఇప్పుడిప్పుడే నోరు విప్పుతున్నారు. గత 5 రోజులుగా వారిని పోలీసులు, NIA అధికారులు సంయుక్తంగా ప్రశ్నిస్తున్నారు. ఇద్దరినీ విజయనగరంలోని పోలీస్‌ ట్రెయినింగ్‌ కాలేజీలో విచారణ జరుగుతోంది. మొదటి మూడు రోజులు ఇద్దరూ విచారణకు సహకరించలేదు. సిరాజ్, సమీర్ ఉగ్ర కుట్రలో భాగంగానే స్లీపర్ సెల్స్‌ను తయారు చేసినట్లు చెప్పారని తెలుస్తోంది. అహిం పేరుతో గ్రూప్‌లు ఏర్పాటు చేసి.. గ్రూప్ సభ్యలును స్లీపర్ సెల్స్‌గా మార్చాలని ప్లాన్ చేశారు. గ్రూప్ సభ్యులకు ఎలాంటి సహాయ సహకారాలను అందించేవారో అన్న విషయాన్ని సిరాజ్ ఎన్ఐఏకు చెప్పినట్లు సమాచారం. గ్రూప్ సభ్యుల వివరాలను పోలీసులకు అందించినట్టు తెలుస్తోంది. సౌదీకి చెందిన హ్యాండ్లర్లు ఇలాంటి‌ గ్రూపులు అనేకం ఏర్పాటు చేసినట్లు విచారణలో తేలింది.

Read Also: MP: హనీమూన్‌కి వెళ్లి అదృశ్యమైన జంట.. అసలేం జరిగింది?

మసీదుల నిర్మాణాలకు డొనేషన్లు, పేదరికంలో ఉన్న ముస్లింలను ఆర్ధికంగా ఆదుకోవడం ఈ గ్రూప్ ద్వారా జరిగాయని సిరాజ్ చెప్పినట్లు సమాచారం. ఎక్కడికక్కడ గ్రూప్స్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహించేలా హ్యాండ్లర్లు దిశా నిర్దేశం చేస్తున్నారు. వెనుకబడిన యువతను, ఉద్యోగాలు-ఉపాధి లేక నిరుత్సాహంలో ఉన్నవారిని టార్గెట్‌ చేసుకొని… ముగ్గులోకి‌ దింపుతున్నారు. వారికి డబ్బు ఎర వేసి స్లీపర్ సెల్స్‌గా మారుస్తున్నారని సిరాజ్ వెల్లడించాడు. దేశంలో అనేక గ్రూపులు ఉన్నట్టు.. అవన్నీ ఇదే విధంగా పని చేస్తున్నట్టు సిరాజ్ బయటపెట్టాడు. గ్రూప్ సభ్యులను సోషల్ మీడియాలో యాక్టివ్‌ చెయ్యడం, వారిని మరింత ప్రోత్సహించడం కొందరి పని అని సిరాజ్ చెప్పాడు.

Read Also: RCB vs LSG: సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే..?

సిరాజ్‌ ఎవరెవరిని కలిశాడు. ఎవరెవరితో కాంటాక్ట్‌ అయ్యాడు. ఏ ఏ నగరాలను టార్గెట్ చేశారన్న వివరాలను రాబట్టే పనిలో NIA అధికారులున్నారు. విశాఖకు చెందిన రెవెన్యూ ఉద్యోగి నుంచి ఎలాంటి సాయం అందిందన్న వివరాలు కూడా దర్యాప్తు అధికారులకు సిరాజ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తాము సేకరించిన ఆధారాలు చూపించి సిరాజ్‌, సమీర్‌లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్, మహరాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో యాక్టివిటీపై NIA కూడా సమాచారం సేకరించింది. వరంగల్‌కు చెందిన పరహాన్ మోయిన్, యూపీకి చెందిన బాదర్‌లతో పరిచయాలపై కూపీ లాగుతున్నారు.

Exit mobile version