Fake Bomb Threat Case: 800 బాంబు బెదిరింపులు.. చివరకు చెన్నైలో చిక్కిన నిందితుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించిన ఫేక్ బాంబు బెదిరింపుల పరంపరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు తెరదించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)తో పాటు దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు నకిలీ బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ పంపుతున్న ప్రధాన నిందితుడిని ప్రత్యేక బృందం చాకచక్యంగా చెన్నైలో అరెస్ట్ చేసింది.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ వికృత చేష్టలు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చెన్నైకి చెందిన శరత్ సుబ్రహ్మణ్యం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తమిళనాడులోని డీఎంకే (DMK) పార్టీ నాయకులపై ఉన్న వ్యక్తిగత కోపం, కక్షతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు పంపి, ఆ నేరాన్ని సదరు డీఎంకే నేతలపై నెట్టి వారిని ఇబ్బందుల్లోకి నెట్టాలని, పోలీసుల చర్యలు వారిపై ఉంటాయనే దురుద్దేశంతోనే ఈ నకిలీ ఈ-మెయిల్స్ పంపినట్లు విచారణలో నిందితుడు స్పష్టం చేశాడు.
Also Read
- Retired IPS Officer Wife Murder Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు..
- Eagle Force: హైదరాబాద్‌లో ఈగిల్ ఫోర్స్ మెరుపు దాడి.. 75 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్
- Honey Trap: ఇన్‌స్టాలో అమ్మాయి పేరుతో నకిలీ ప్రొఫైల్.. దేశవిదేశాల్లోని యువకులను ముంచేసిన కేటుగాడు..
- Software Engineer S*uicide: ‘పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా’.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్చన ఆత్మహత్య.!
దేశవ్యాప్తంగా 800 మెయిల్స్.. శంషాబాద్‌కే 45 సార్లు నిందితుడు గత రెండేళ్లుగా (2025, 2026) నిరంతరాయంగా ఎయిర్‌పోర్టుల భద్రతా విభాగానికి నకిలీ మెయిల్స్ పంపిస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మాత్రమే ఏకంగా 45 సార్లు ఫేక్ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపాడు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విమానాశ్రయాలకు కలిపి మొత్తం 800 వరకు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది.
చెన్నైలో పక్కా ప్లాన్‌తో పట్టివేత.. రిమాండ్‌కు తరలింపు టెక్నాలజీని ఉపయోగించి గుర్తింపు చిక్కకుండా బెదిరింపులకు పాల్పడుతున్న నిందితుడి కోసం శంషాబాద్ డీసీపీ, ఏసీపీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సైబర్ నిఘా, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడు చెన్నైలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడికి వెళ్లి శరత్ సుబ్రహ్మణ్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్ శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించి లోతుగా విచారించారు. అనంతరం నిందితుడిపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
తాజావార్తలు
-
Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
-
Amit Shah : కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీ పాదయాత్ర.. పాల్గొననున్న అమిత్ షా
-
Ind Vs NZ: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. బరిలోకి దిగనున్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్..
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
-
TGGENCO : టీజీ జెన్కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..