Site icon NTV Telugu

దారుణం: చెల్లిపై అన్న అత్యాచారం.. స్కూల్లో దింపుతానని చెప్పి

tamilanadu

tamilanadu

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్ళుమూసుకుపోయిన ఒక యువకుడు వావివరుస అనే విచక్షణ మరిచి చెల్లిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణగిరిలో వెలుగుచూసింది. వివరాలలోకివెళితే కృష్ణగిరి ప్రాంతానికి చెందిన విజయ్ అనే యువకుడు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవలే విజయ్ తల్లి అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో విజయ్ ఒంటరివాడయ్యాడు. విజయ్ బాధ చూడలేని సవతి తల్లి అతడిని ఇంటికి తీసుకొచ్చి బాగోగులు చూడసాగింది. కానీ, విజయ్ కన్ను మాత్రం సవతి తల్లి 15 ఏళ్ల కూతురుపై పడింది.

సోమవారం చెల్లిని స్కూల్లో దింపివస్తానని బైక్ ఫై ఎక్కించుకొని వెళ్లిన విజయ్, బాలికను స్కూల్ వద్దకు తీసుకెళ్లకుండా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారం చేశాడు. అన్నయ్య.. వద్దు అన్నయ్యా అని బాలిక ఎంత బతిమిలాడినా కనికరించకుండా బలవంతంగా లొంగదీసుకున్నాడు. అనంతరం బాలికను ఇంటివద్ద దింపి ఈ విషయం ఇంట్లో చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అయితే బాలిక నీరసంగా ఉండడం గమనించిన తల్లి నిలదీసి అడగడంతో బాలిక జరిగింది చెప్పింది. దీంతో ఆమె, బాలికను తీసుకువెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు విజయ్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Exit mobile version