Site icon NTV Telugu

Serial killer: డ్రైవర్లను టార్గెట్ చేస్తూ చంపే సీరియల్ కిల్లర్.. 24 ఏళ్ల తర్వాత అరెస్ట్..

Serial Killer

Serial Killer

Serial killer: 24 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ‘‘సీరియల్ కిల్లర్’’ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కిల్లర్ అజయ్ లాంబాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. క్యాబ్ డ్రైవర్లను టార్గెట్ చేస్తూ చంపే లాంబా, ఢిల్లీ, ఉత్తరాకండ్ అంతటా అనేక మర్డర్లకు పాల్పడే ముఠాను నడించాడనే ఆరోపణలు ఉన్నాయి.

Read Also: Lucky Bhasker : లక్కీ భాస్కర్ కు సీక్వెల్ చేస్తా.. వెంకీ అట్లూరి క్లారిటీ

లాంబా, అతడి ముగ్గురు సహచరులు కస్టమర్లుగా నటిస్తూ టాక్సీ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసేవారు. రైడ్ బుక్ చేసుకున్న తర్వాత, ఈ ముఠా డ్రైవర్లను ఉత్తరాఖండ్ కొండల్లోని మారుమూల ప్రాంతాలకు రప్పించేంది. ఈ ముఠా డ్రైవర్లపై స్పృహ కోల్పోయేలా చేసి, గొంతు కోసి చంపి, లోతైన లోయలో మృతదేహాన్ని పారేసేది. దొంగలించిన వాహనాలను నేపాల్ కు అక్రమంగా తరలించి విక్రయించేవారు.

అధికారులు ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కనీసం ముగ్గురు బాధితుల అవశేషాలు ఇంకా లభించలేదు. కొన్ని ఏళ్లుగా అనేక మంది క్యాబ్ డ్రైవర్ల అదృశ్యం వెనక ఈ ముఠా హస్తం ఉండవచ్చని అధికారులు భయపడుతున్నారు. గత 10 ఏళ్లుగా లాంబా నేపాల్‌లో దాక్కున్నట్లు పోలీసులు తెలిపారు. లాంబాకు హత్యలతో పాటు ఢిల్లీ, ఒడిశాలో డ్రగ్స్ అక్రమ రవాణా, దోపిడీ చేసిన రికార్డు కూడా ఉంది. 2001 నుంచి నేర కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అతని సహచరులలో ఒకరైన ధీరేంద్ర దిలీప్ పాండేను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు, మరో ముఠా సభ్యుడు ధీరజ్ పరారీలో ఉన్నాడు. దర్యాప్తు కొనసాగుతోంది. అజయ్ లాంబా నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసులు విచారిస్తున్నారు.

Exit mobile version